బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త… ఆ చార్జీల ఎత్తివేత!
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారి నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) చార్జీలను వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) ట్రాన్సాక్షన్లపై చార్జీలు తొలగిస్తామని ప్రకటించింది. ఇప్పటికే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్ […]
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారి నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) చార్జీలను వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) ట్రాన్సాక్షన్లపై చార్జీలు తొలగిస్తామని ప్రకటించింది. ఇప్పటికే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్ లావాదేవీలకు బ్యాంకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఇకపై బ్యాంకుకు వెళ్లి ఇతరులకు నెఫ్ట్ రూపంలో డబ్బు పంపాలన్నా ఎలాంటి చార్జీలు పడవు.
‘డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి తాము వసూలు చేసే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్లపై చార్జీలను తొలగించాలని నిర్ణయించాం. దీంతో బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలి. ఒక వారంలోగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయి’ అని ఆర్‌బీఐ తెలిపింది. పెద్ద మొత్తంలో డబ్బులు పంపేందుకు ఆర్‌టీజీఎస్ విధానాన్ని ఉపయోగిస్తారు. రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య డబ్బులు పంపేందుకు ఈ విధానాన్ని వాడతారు. ఇక నెఫ్ట్ మార్గంలో రూ.2 లక్షల వరకు లావాదేవీలను నిర్వహించొచ్చు. ఆర్‌బీఐ ఇంకా నెఫ్ట్ సర్వీసులు రోజంతా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 2019 డిసెంబర్ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.ఇప్పుడు నెఫ్ట్ సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.