AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుమలత కామ క్రైం కథ.. చూస్తే దిమ్మతిరగాల్సిందే…

ఆమె.. మగాడిలా మారింది. మనిషి మాత్రం మహిళే.. కానీ బుద్ది మాత్రం మగబుద్ది. అంతేకాదు ఆమెకు అతడిలా ప్రవర్తిచండం అంటే తెగ ఇష్టం. అందులో సెక్స్‌ విషయంలో మరీనూ.. అయితే తన అసహజ శృంగారానికి ఆమె చేసిన చేష్టలు విస్తుగొల్పుతాయి. ఆమె అసహజ కామ క్రీడకు పావులుగా.. యుక్తవయస్సులో ఉన్న బాలికలను, యువతులను లోబరుచుకునేది. వారితో అనైతిక కామవాంచలు తీర్చుకుంటుండేది. అందు కోసం.. ఆమె బాలికలు, యువతులే కాదు.. మహిళలను కూడా ట్రాప్‌ చేసేది. అందుకు వారితో […]

సుమలత కామ క్రైం కథ.. చూస్తే దిమ్మతిరగాల్సిందే...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 08, 2019 | 7:45 PM

Share

ఆమె.. మగాడిలా మారింది. మనిషి మాత్రం మహిళే.. కానీ బుద్ది మాత్రం మగబుద్ది. అంతేకాదు ఆమెకు అతడిలా ప్రవర్తిచండం అంటే తెగ ఇష్టం. అందులో సెక్స్‌ విషయంలో మరీనూ.. అయితే తన అసహజ శృంగారానికి ఆమె చేసిన చేష్టలు విస్తుగొల్పుతాయి. ఆమె అసహజ కామ క్రీడకు పావులుగా.. యుక్తవయస్సులో ఉన్న బాలికలను, యువతులను లోబరుచుకునేది. వారితో అనైతిక కామవాంచలు తీర్చుకుంటుండేది. అందు కోసం.. ఆమె బాలికలు, యువతులే కాదు.. మహిళలను కూడా ట్రాప్‌ చేసేది. అందుకు వారితో మగ గొంతుతో ఫోన్లో మాట్లాడుతూ.. పరిచయం పెంచుకునేది. తన పేరు సాయితేజా రెడ్డిగా చెబుతూ మనసు పరవశించేలా ప్రేమలేఖలు రాస్తుండేది. ఆ తర్వాత తన ట్రాప్‌లో పడ్డాక బాలికలపై.. అనైతిక చర్యలకు పాల్పడేది. ఏకంగా వారికి మత్తు మందిచ్చి.. మగవాళ్ళు వేసుకునే దుస్తులు వేసుకుని.. వారిపై లైంగిక దాడులకు దిగేది. అది కూడా అనైతికంగా..

అందుకోసం ఏకంగా సెక్స్ టాయ్స్‌ను ఉపయోగించేది. అలా చేస్తూ ఆ బాలికలకు నరకం చూపిస్తూ.. కామపిశాచి అవతారం ఎత్తేది. ఇలా అమాయక బాలికలను ట్రాప్‌లో వేసి.. పైశాచికానందం పొందుతూ ఉండేది. అయితే ఈ కామపిశాచి కథ మాత్రం ఇన్ని రోజులు ఎవరికీ తెలియలేదు.  అతడిగా మారిన ఈమె.. వలలో పడిన ఓ బాలిక.. ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ క్రైం స్టోరీ వెలుగులోకి వచ్చింది. అయితే ఇంతకాలం ఆమె చేస్తున్న అనైతిక కార్యకలాపాలకు వత్తాసు పలికిన ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడు..  పోలీసులు రంగంలోకి దిగడంతో అవమానం తట్టుకోలేక పోయాడు. దీంతో మూడంతస్తుల బిల్టింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ క్రైం స్టోరీ విషాదంగా మారింది.

వివరాల్లోకి వెళితే… ప్రకాశం జిల్లాకు చెందిన సుమలత.. చాన్నాళ్లక్రితమే భర్తను వదిలేసింది. భార్యను వదిలేసిన ఏడుకొండలు అనే వ్యక్తితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. వీళ్ళు మూడు నెలల క్రితం ఒంగోలు మారుతీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో… అక్కడే సిమ్‌కార్డ్స్‌ విక్రయించే వంశీ అనే యువకుడితో సుమలత, ఏడుకొండలకు పరిచయం ఏర్పడింది. సిమ్‌ కొనగోలు కోసం వచ్చే యువతుల ఫోన్ నంబర్లను.. వంశీ సుమలతకు అందజేసేవాడు. ఆ ఫోన్ నంబర్లకు సుమలత.. మగగొంతుతో మాట్లాడుతూ.. వారిని ట్రాప్‌లోకి దింపేది. అంతేకాదు.. వారిని మెల్లిగా తన ఇంటికి పిలిపించుకుని.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడేది. సుమలతే కాదు.. అటు సహజీవనం చేస్తున్న ఏడుకొండలు.. వంశీ కూడా అత్యాచారానికి ఒడిగట్టేవారు. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు, కాలేజీ విద్యార్థినులు, బాలికలను లక్ష్యంగా చేసుకొని సుమలత ఈ కామ క్రీడలకు పాల్పడేది. అయితే అవమాన భారంతో బాధితులంతా మౌనంగా ఉండిపోయారు.

సుమలత కామ క్రీడలు ఎలా బయటపడ్డాయంటే..

ఈనెల 2వ తేదిన జరుగుమల్లి మండలంలోని ఓ గ్రామానికి వెళ్లిన సుమలత, ఏడుకొండలు అక్కడి నుంచి ఓ బాలికను మభ్యపెట్టి ఆటోలో ఒంగోలులోని తమ ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఆ బాలికకు మత్తు మందు ఇచ్చి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఏకంగా రెండు రోజుల పాటు ఆ బాలికకు మత్తుమందు ఇచ్చి.. సెక్స్‌ టాయ్స్‌తో అత్యాచారానికి ఒడిగట్టింది. అయితే ఎట్టకేలకు సుమలత చెర నుంచి బయటపడిన ఆ బాధిత బాలిక.. స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో సుమలత కామ క్రైం కథ వెలుగులోకి వచ్చింది. సుమలత కాకుండా, తనపై మరి కొంతమంది కూడా అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సుమలత, సిమ్‌కార్డులు అమ్మే వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ క్రమంలోనే విషాదం చోటుచేసుకుంది. సుమలత ప్రియుడు.. ఏడుకొండలును అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో.. ఆ రూంలో సెక్స్‌ టాయ్స్‌ లభ్యమయ్యాయి. వాటిని చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. భయబ్రాంతులకు గురైన ఏడుకొండలు.. బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. దీంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. మృతిచెందాడు.

కృత్రిమ పరికరాలతో..

అయితే ఈ కేసులో సుమలత ప్రవర్తన చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఆమె బాలికలను, యువతులను ట్రాప్ చేసేందుకు.. మగాడిలా బాలికలకు రాసిన ప్రేమ లేఖలు.. కృత్రిమ లైంగిక పరికరాలు, అసహజ లైంగిక కార్యకలాపాలు.. ఇలా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పైకి మాత్రం సాంప్రదాయంగా కనిపిస్తూ.. లోపల మాత్రం ఎవరికీ తెలియని ఇలాంటి కోణం మరొకటి ఉందని తెలిసి.. చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.

బాలికపై అత్యాచారం చేసిన సుమలత..

అయితే ఈ కేసులో మరిన్ని విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచారం చేసింది.. సుమలతే అని తెలిసింది. రూంలో సుమలత ధరించే దుస్తులు, లైంగిక చర్యకు ఉపయోగించే కృత్రిమ సెక్స్‌ పరికరాలు, నడుముకు చుట్టుకునే బెల్టు వంటి వాటిని సీజ్‌ చేశారు. కృత్రిమ పరికరాలు బయటపడడంతో ఇదేదో అసహజ లైంగిక చర్యగా భావించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో తమకు ఫిర్యాదు ఇచ్చిన మైనర్‌ను ట్రాప్‌ చేసి మగ వేషంలో లైంగిక దాడికి పాల్పడింది కూడా సుమలతగానే నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె వినియోగించిన సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డుల ఆధారంగా కాల్‌ డేటాపై దృష్టి సారించారు. ఆ కాల్‌ డేటాలో ఆమె అనేక మంది మైనర్లను ట్రాప్‌ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో నిందితురాలు ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి సుమలత క్రైం కహానీ.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.