Success Story: ఈ విజయం.. ‘వనిత’ర సాధ్యం.. రూ. 80తో ప్రారంభమై రూ. 1,600కోట్ల టర్నోవర్..
60 ఏళ్ల క్రితం ఏడుగురు మహిళలు కలిసి, రూ. 80లను అప్పు చేసి మరీ ప్రారంభించిన ఆ వ్యాపారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా టాప్ బ్రాండ్ గా అవతరించింది. ఏకంగా 45,000 మహిళలకు ఉపాధినిస్తోంది. ఇంతకీ ఎంటా బిజినెస్ అని ఆలోచిస్తున్నారు. అప్పడాల వ్యాపారం. దాని పేరు లిజ్జత్ పాపడ్.. ఈ పేరు వినపబడిన ఇల్లు మన దేశంలో ఎక్కడా ఉండదు. ప్రతి వంట గదిలో కనిపించే స్నాక్ ఇది. లిజ్జత్ పాపడ్ ప్రస్థానం ఒక్కసారి చూస్తే..

ఓ ఇంటి మేడపైన రూ. 80తో మొదలైన బిజినెస్.. ఇప్పుడు రూ. కోట్లు టర్నోవర్ కలిగిన అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారిందంటే నమ్మగలరా? మీరు చదువుతున్నది నిజమేనండి. 60 ఏళ్ల క్రితం ఏడుగురు మహిళలు కలిసి, రూ. 80లను అప్పు చేసి మరీ ప్రారంభించిన ఆ వ్యాపారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా టాప్ బ్రాండ్ గా అవతరించింది. ఏకంగా 45,000 మహిళలకు ఉపాధినిస్తోంది. ఇంతకీ ఎంటా బిజినెస్ అని ఆలోచిస్తున్నారు. అప్పడాల వ్యాపారం. దాని పేరు లిజ్జత్ పాపడ్.. ఈ పేరు వినపబడిన ఇల్లు మన దేశంలో ఎక్కడా ఉండదు. ప్రతి వంట గదిలో కనిపించే స్నాక్ ఇది. లిజ్జత్ పాపడ్ ప్రస్థానం ఒక్కసారి చూస్తే.. ఆశ్చర్యం కలుగక మానదు. 1959లో ప్రారంభమైన ఈ వ్యాపారం 2019 నాటికి రూ. 1,600 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ప్రతిరోజూ 4.8 మిలియన్ పాపడ్‌లను తయారు చేసే 45,000 మంది మహిళలు (2021) సహ-యాజమాన్యంలో ఉన్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంలా.. అనేకమంది ఔత్సాహిక మహిళలకు స్ఫూర్తినిచ్చే ఈ విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం..
లిజ్జత్ పాపడ్ కథ ఇది..
ఈ బ్రాండ్‌ని మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ అనే మహిళా వర్కర్ కోఆపరేటివ్ నిర్వహిస్తోంది. 1959లో ముంబైలోని గిర్‌గామ్‌లో నివసిస్తున్న ఏడుగురు మహిళల బృందం ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్, పార్వతీబెన్ రాందాస్ తోడనీ, ఉజంబెన్ నారందాస్ కుండలియా, బానుబెన్ ఎన్ తన్నా, లగుబెన్ అమృత్‌లాల్ గోకాని, జయబెన్ వి వితలానీ, దివాలీబెన్ లుక్కా అనే మహిళలు తమ వ్యాపారం కోసం ఛగన్‌లాల్ కరంసీ పరేఖ్ అనే సామాజిక కార్యకర్త నుంచి రూ.80 డబ్బును అప్పుగా తీసుకున్నారు. డబ్బుతో ముడిసరుకును కొనుగోలు చేసి పాపడ్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదటి రోజు నాలుగు ప్యాకెట్లతో ప్రారంభించి, మొదటి సంవత్సరంలో 6,000 రూపాయలకు పైగా విలువైన పాపడ్‌లను విక్రయించారు. 1962లో నగదు బహుమతి పోటీ నుండి ఎంపికైన తర్వాత బ్రాండ్ పేరు ‘లిజ్జత్’ గా మార్చారు. అప్పట్లో విక్రయాలు రూ.2 లక్షలకు చేరువలో ఉన్నాయి. నెమ్మదిగా వారు ఉత్పత్తిని పెంచారు. అందుకోసం వాటిని తయారు చేసే మహిళలను తీసుకున్నారు. వారంతా సహ-యజమానులుగానే ఉంటారు. కొంత సమయంలోనే కొన్ని వందల నుంచి వేల మంది మహిళలు వ్యాపారంలో భాగస్వాములు అయ్యారు. దీంతో ఓ ప్రాంతీయ మీడియా వీరి విజయప్రస్థానాన్ని ప్రచారాన్ని కల్పించడంతో బ్రాండ్ ఆరు దశాబ్దాల చరిత్రలో 2002 నాటికి 42,000 మంది మహిళలకు, 2021 నాటికి 45,000 మంది మహిళలకు సాధికారత కల్పించింది. ఈ సంస్థ ఎనభై రెండు శాఖలను కలిగి ఉంది. యూఎస్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇది డిటర్జెంట్ సబ్బు, రోటీస్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా చేస్తుంది.
పద్మశ్రీ అవార్డు..
2021లో, లిజ్జత్ పాపడ్ ఎంటర్‌ప్రైజ్ సహ వ్యవస్థాపకురాలు 90 ఏళ్ల జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.
President Kovind presents Padma Shri to Smt. Jaswantiben Jamnadas Popat for Trade and Industry. She is one of the founders of Shri Mahila Griha Udyog Lijjat Papad, a women’s worker cooperative involved in the manufacturing of various fast-moving consumer goods. pic.twitter.com/tfdK7Et0ax
— President of India (@rashtrapatibhvn) November 9, 2021
మహిళలను శక్తివంతం చేస్తుంది..
లిజ్జత్ పాపడ్ ఎంటర్‌ప్రైజ్‌లోని ప్రతి మహిళా సభ్యురాలు పాపడ్‌లను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే సంస్థలో తన స్థానం ప్రకారం సంపాదిస్తుంది. కొంతమంది మహిళలు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని సంస్థ అధ్యక్షురాలు స్వాతి రవీంద్ర పరాద్కర్ గత ఏడాది ప్రకటించారు. ఈ సంస్థ పురుషులను డ్రైవర్లుగా, షాప్ అసిస్టెంట్లుగా, సహాయకులుగా మాత్రమే నియమిస్తుంది. ప్రస్తుతం సంస్థ ప్రెసిడెంట్ పరాద్కర్ స్వయంగా రెండో తరం సహ-యజమాని, ఆమె 10 సంవత్సరాల వయస్సులో తన తండ్రిని కోల్పోయిన తర్వాత చిన్న వయస్సులో తన తల్లితో పాటు పాపడ్‌లను చుట్టడం ప్రారంభించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..