AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీలాంటి చల్లదనం.. కేవలం రూ. 5 వేలకే ఈ కూలర్‌ను ఇంటికి తెచ్చుకోండి.!

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూపోతున్నాయి. వేడి, ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భానుడి భగభగల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లకు పని చెబుతున్నారు. సాధారణంగా ఓ మోస్తరు వేడి అయితే..

ఏసీలాంటి చల్లదనం.. కేవలం రూ. 5 వేలకే ఈ కూలర్‌ను ఇంటికి తెచ్చుకోండి.!
Air Cooler
Ravi Kiran
|

Updated on: Mar 14, 2024 | 7:02 PM

Share

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూపోతున్నాయి. వేడి, ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భానుడి భగభగల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లకు పని చెబుతున్నారు. సాధారణంగా ఓ మోస్తరు వేడి అయితే.. ఫ్యాన్ సరిపోతుంది. అది మించితే.. ఏసీ లేదా కూలర్ ఉండాల్సిందే. మరి ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఫ్యాన్ల కంటే ఏసీలు, కూలర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మరి మీరు కూడా ఇంటికి ఎయిర్ కూలర్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.? మీకోసం తక్కువలో దొరికే ఓ కూలర్‌ను ఎంపిక చేశాం. ఇది ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మరి దాని ఫీచర్లు ఏంటో చూసేద్దాం.

సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. హవెల్స్ కంపెనీకి చెందిన కాల్ట్ మోడల్ హావెల్స్ హెవీ డ్యూటీ పర్సనల్ ఎయిర్ కూలర్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఎయిర్ కూలర్‌పై దాదాపు 41 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 8,790 కాగా.. డిస్కౌంట్ పోనూ రూ. 5,189కి లభిస్తోంది. అంటే.. దాదాపుగా మూడున్నర వెయ్యి మీకు లాభం. ఈ కూలర్ మీకు భగభగ మండే ఎండల్లో.. ఏసీలాంటి చల్లటి చల్లదనాన్ని ఇస్తుంది. క్షణాల్లో ఇల్లంతా హిమపాతం చేస్తుంది.

ఈ ఎయిర్ కూలర్ కెపాసిటీ 24 లీటర్లు కాగా.. బరువు ఏడు కిలోలుగా ఉంది. అలాగే దీనికి అమర్చిన క్యాస్టర్ వీల్స్ ద్వారా సులభంగా ఇంట్లో ఎక్కడికైనా ఈ ఎయిర్ కూలర్‌ను ఈజీగా తీసుకుని వెళ్లొచ్చు. ఈ కూలర్ ఆన్ చేసినప్పుడు.. సౌండ్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అలాగే ఇందులో ఉండే 3 సైబ్ హనీకాంబ్ ప్యాడ్స్ వేడి గాలిని చల్లటి హిమపాతంలా మారుస్తుంది. కాగా, ఈ ఎయిర్ కూలర్‌కు 1 సంవత్సరం వారంటీ కూడా లభిస్తోంది. మరి లేట్ ఎందుకు ఓసారి మీరూ లుక్కేయండి.(Source)

Follow Us