AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోమ్ వర్క్ చేయలేదని ఇంత దారుణమా..? రెండో తరగతి విద్యార్థిపై స్కూల్ టీచర్ దాష్టీకం..!

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో మూల స్తంభాలైన ఉపాధ్యాయులే నైతికతను మరచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడు చేసిన పనికి రెండో తరగతి విద్యార్థి ఆసుపత్రి పాలయ్యారు.

హోమ్ వర్క్ చేయలేదని ఇంత దారుణమా..? రెండో తరగతి విద్యార్థిపై స్కూల్ టీచర్ దాష్టీకం..!
Teacher Brutalizes Second Class Student
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 6:31 PM

Share

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో మూల స్తంభాలైన ఉపాధ్యాయులే నైతికతను మరచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడు చేసిన పనికి రెండో తరగతి విద్యార్థి ఆసుపత్రి పాలయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని విజ్ఞాన్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ సరిగా చేయలేదనే కారణంతో రెండో తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ తీవ్రంగా కొట్టాడు. విద్యార్థి నొప్పితో తల్లడిల్లితూ ఇంటికి చేరింది. ఈ ఘటన స్థానికంగా ఆగ్రహానికి దారి తీసింది.

తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో విజ్ఞాన్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సోఫియా అనే విద్యార్థినిని సంబంధిత టీచర్ వాతలు వచ్చేలా చితకబాదినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి నిలదీశారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us