Car Loan: పాత కారు అమ్మి.. కొత్త కారు కొందామని అనుకుంటున్నారా? పాత కారు లోన్ ఎలా క్లియర్ చేసుకోవచ్చో తెలుసా?

Car Loan: పాత కారు అమ్మి.. కొత్త కారు కొందామని అనుకుంటున్నారా? పాత కారు లోన్ ఎలా క్లియర్ చేసుకోవచ్చో తెలుసా?
Car Loan

భారతదేశంలో, ప్రతి 3-5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చే ధోరణి పెరిగింది. ఇలా కారును మూడు నాలుగేళ్ళలో మార్చాలని అనుకున్నపుడు పాత కారును విక్రయించాల్సి వస్తుంది.

KVD Varma

|

Dec 07, 2021 | 7:46 AM

Car Loan: భారతదేశంలో, ప్రతి 3-5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చే ధోరణి పెరిగింది. ఇలా కారును మూడు నాలుగేళ్ళలో మార్చాలని అనుకున్నపుడు పాత కారును విక్రయించాల్సి వస్తుంది. అయితే, ఎక్కువగా ఇటువంటి పరిస్థితిలో పాత కారుపై ఉన్న రుణం ఇబ్బందులను తెస్తుంది. ఎందుకంటే.. పాత కారును అమ్మాలని నిర్ణయించుకుననపుడు మొదట దానిపై ఉన్న రుణాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. మీరు లోన్ బాకీ ఉన్న కారును విక్రయించాలని ప్లాన్ చస్తుంటే ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

మీ కారు లోన్‌పై బకాయి ఉన్న మొత్తాన్ని తెలుసుకోవడానికి బ్యాంకర్/ఫైనాన్స్ ఏజెన్సీతో మాట్లాడి ఎంత మొత్తం లోన్ బకాయి ఉన్నదో తెలుసుకోండి. దీని తర్వాత, మీరు లోన్ ప్రీ-క్లోజర్ ఫారమ్‌ను పూరించి సమర్పించాలి. ఆ తర్వాత మీరు మిగిలిన చెల్లింపును చెల్లించాలి. మీరు లోన్ బకాయి చెల్లించిన తర్వాత NOC కోసం దరఖాస్తు చేసుకోండి NOC కోసం అన్ని బాకీ ఉన్న దరఖాస్తులను బ్యాంక్ (NOC)కి చెల్లించిన తర్వాత. మీ వివరాలను ధృవీకరించిన తర్వాత బ్యాంక్ 1-2 రోజుల్లో NOC, ఫారమ్ 35 రెండు కాపీలను జారీ చేస్తుంది. ఆ తర్వాత మీరు కారును విక్రయించగలరు.

రుణాన్ని చెల్లించే డబ్బు లేకపోతే..

మీ వద్ద చెల్లించడానికి డబ్బు లేకపోతే, మీరు మీ కారును కొనుగోలు చేస్తున్న కంపెనీ రుణాన్ని చెల్లిస్తుంది. మీ కారును మీరు కంపెనీకి ఇచ్చేసిన వెంటనే ఈ కంపెనీలు మీ లోన్ ఖాతాలోని బ్యాలెన్స్ మొత్తాన్ని బదిలీ చేస్తాయి. ఆ తర్వాత మీరు ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు కంపెనీకి ఎన్‌ఓసీ, కారు పత్రాలను ఇచ్చినప్పుడు, కంపెనీ డీల్‌లో మిగిలిన మొత్తాన్ని మీ ఖాతాకు బదిలీ చేస్తుంది. హైపోథెకేషన్ తొలగింపు కోసం RTOకి దరఖాస్తు చేసుకోండి

ఎన్‌ఓసీతో పాటు, మీ పాన్ కార్డ్, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఫారం 28, 29, 30, 35, అమ్మకం అఫిడవిట్, క్లియరెన్స్ సర్టిఫికేట్, RC, PUC, బీమా, RTOకి బీమా బదిలీ కోసం కావలసిన ఫీజు సొమ్ములను సమర్పించడం ద్వారా RC నుంచి హైపోథెకేషన్ (HP) తొలగింపు కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu