Putin in India: భారత రష్యా సంబంధాలకు బూస్టర్ డోస్ ఇచ్చిన పుతిన్ పర్యటన.. వాణిజ్య బంధాలపై పలు ఒప్పందాలు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీకి సోమవారం ఢిల్లీ సాక్షిగా నిలిచింది. రష్యాతో మన స్నేహం పాతది.

Putin in India: భారత రష్యా సంబంధాలకు బూస్టర్ డోస్ ఇచ్చిన పుతిన్ పర్యటన.. వాణిజ్య బంధాలపై పలు ఒప్పందాలు!
Follow us
KVD Varma

|

Updated on: Dec 07, 2021 | 6:48 AM

Putin in India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీకి సోమవారం ఢిల్లీ సాక్షిగా నిలిచింది. రష్యాతో మన స్నేహం పాతది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు శక్తివంతమైన నాయకుల సమావేశం ఈ బంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా, రెండు దేశాల ఆర్థిక వ్యవస్థకు 6 లక్షల కోట్ల రూపాయల (80 బిలియన్ డాలర్లు) బూస్టర్ డోస్ ఇస్తుంది. ఈ దేశాలు 2025 నాటికి టూ-వే పెట్టుబడిని 50 బిలియన్ల డాలర్లకు చేర్చాలని కోరుకుంటున్నాయి. అలాగే 30 బిలియన్ల డాలర్లకు మించి వ్యాపారం చేయాలని కోరుకుంటున్నాయి. పుతిన్ పర్యటనలో 28 ఒప్పందాలు కుదిరాయి. భారత్‌-రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు, మోడీ -పుతిన్‌ల భేటీ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రష్యాతో భారతదేశం స్నేహ పూరితంగానే ఉంటూ వస్తోంది. భారత్ రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, పారిశ్రామిక సాంకేతికత అనేక ఇతర రంగాల అభివృద్ధిలో రష్యా ముఖ్యమైన పాత్ర పోషించింది. 1990వ దశకంలో సోవియట్‌ యూనియన్‌ విడిపోయిన సమయంలో భారత్‌, రష్యాల మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. రాజకీయాలైనా, ఆర్థికమైనా రెండు రంగాల్లోనూ రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రెండు దేశాలు ఒకరికొకరు మద్దతుగా పలు ఒప్పందాలు చేసుకున్నారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. రష్యా తన రక్షణ అవసరాలను తీర్చడంలో భారతదేశానికి చాలా కాలంగా అతిపెద్ద మిత్రదేశంగా ఉంది. రక్షణతో పాటు పెట్రోలియం, ఫార్మా, అణుశక్తి వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఉంది.

మోడీ-పుతిన్ కాలంలో బలపడిన స్నేహం..

మోడీ ప్రధాని అయిన తర్వాత పుతిన్‌తో చాలాసార్లు భేటీ అయ్యారు. ప్రతిసారీ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని సహకారానికి అంగీకరించారు. ఈ కాలంలోనే భారత్-రష్యా స్నేహం బలపడింది. ఇక 2020-21 గురించి చూసినట్టయితే, రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 8.1 బిలియన్ డాలర్లు. ఈ కాలంలో భారత ఎగుమతులు 2.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, రష్యా నుంచి దిగుమతులు 5.48 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ గణాంకాలను వెల్లడించింది.

ఇప్పుడు రష్యా ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంతో వారి ద్వైపాక్షిక వాణిజ్యం 9.31 బిలియన్ డాలర్లు. ఇందులో భారతదేశ ఎగుమతులు 3.48 బిలియన్ డాలర్లు దిగుమతులు 5.83 బిలియన్ డాలర్లు.

ఇప్పుడు రెండు దేశాలు 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. రెండు దేశాలు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఈ దేశాలు కలిసి 2025 నాటికి 50 బిలియన్ల డాలర్లకు మించి పెట్టుబడిని పెట్టాలని కోరుకుంటున్నాయి.

భారతదేశం-రష్యా మధ్య బ్యాంకింగ్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. అనేక రష్యన్ బ్యాంకులు భారతదేశంలో తమ ప్రతినిధి కార్యాలయాలు/శాఖలను ప్రారంభించాయి. అదేవిధంగా, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LLC (SBI, కెనరా బ్యాంక్ జాయింట్ వెంచర్) రష్యాలో బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది.

28 ఒప్పందాలపై సంతకాలు..

పుతిన్ పర్యటన గురించి సమాచారం ఇస్తూ, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ”ఈ పర్యటనలో 28 ఒప్పందాలు జరిగాయి . ఈ ఒప్పందాలు వాణిజ్యం, ఇంధనం, మేధో సంపత్తి, బ్యాంకింగ్, అకౌంటెన్సీ వంటి రంగాలను కవర్ చేస్తాయి. చర్చల్లో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెంపుపై రెండు దేశాలు దృష్టి సారించాయి.” అని చెప్పారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాణిజ్యంలో పెరుగుదల కనిపించింది. రెండు దేశాలు వాణిజ్యం, పెట్టుబడి పథంలో స్థిరమైన పెరుగుదలను ఆశిస్తున్నాయి. వాణిజ్యం, పెట్టుబడిపై, అంతర్గత జలమార్గాలు, ఎరువులు, కోకింగ్ బొగ్గు, ఉక్కు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల రంగాలలో దీర్ఘకాలిక సహకారంతో సహా కొన్ని నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి. అదేవిధంగా చమురు, గ్యాస్ రంగంతో పాటు పెట్రోకెమికల్స్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి మేము మా ఆసక్తిని వ్యక్తం చేసామని ష్రింగ్లా వివరించారు.

ఆర్థిక సంబంధాల కోసం ముఖ్యమైన సమావేశం..

రష్యా చాలా కాలంగా భారతదేశానికి విశ్వసనీయ మిత్రదేశంగా ఉంది. దీని తర్వాత కూడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం చాలా తక్కువగా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటివరకు 10 బిలియన్ డాలర్లకు మించి పెరగలేదు. ద్వైపాక్షిక పెట్టుబడులు కూడా దాని సామర్థ్యం కంటే తక్కువగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో 2025 నాటికి తమ ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లు దాటాలని రెండు దేశాలు కోరుకుంటున్నాయి. భారతదేశానికి సరఫరా అవసరం.. రష్యాకు డిమాండ్ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో రష్యా పర్యటన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఉద్ఘాటించారు.

అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి రాకముందే, రష్యా రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి భారతదేశానికి చేరుకుని ఇక్కడ తమ సహచరులతో చర్చలు జరిపారు. భారత్‌తో 2+2 చర్చలు జరిపిన నాలుగో దేశం రష్యా. రష్యాతో తమ సహకారం కొనసాగుతుందని భారతదేశం ప్రపంచానికి చాటి చెబుతోందన్నది దాని ప్రత్యక్ష సందేశం.

ఇవి కూడా చదవండి: PM Narendra Modi: డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. నేడు గోరఖ్‌పూర్‌లో పర్యటన..

Reliance Jio: జియో యూజర్లకు మరో షాక్‌.. ఆ ప్లాన్‌ ధరలను కూడా పెంచేసింది..!

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా