TVS I-Qube vs Ola S1X: ఈవీ స్కూటర్ల ప్రియులను ఆకట్టుకుంటున్న ఆ రెండు స్కూటర్లు.. ఫీచర్ల విషయంలో ఈ స్కూటర్‌కు లేదు సాటి..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌ కంపెనీలతో పాటు పెట్రో స్కూటర్ల తయారీ కంపెనీలైన బజాజ్, హీరో, టీవీఎస్ వంటి ప్రధాన కంపెనీలు కూడా అనేక మోడళ్ల ఈవీ స్కూటర్లను ప్రస్తుతం అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే ఇటీవల ఈవీ స్కూటర్ల మార్కెట్‌లో ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అమ్మకాలపరంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.

TVS I-Qube vs Ola S1X: ఈవీ స్కూటర్ల ప్రియులను ఆకట్టుకుంటున్న ఆ రెండు స్కూటర్లు.. ఫీచర్ల విషయంలో ఈ స్కూటర్‌కు లేదు సాటి..!
Tvs I Qube Vs Ola S1x
Follow us
Srinu

|

Updated on: Jun 08, 2024 | 8:30 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌ కంపెనీలతో పాటు పెట్రో స్కూటర్ల తయారీ కంపెనీలైన బజాజ్, హీరో, టీవీఎస్ వంటి ప్రధాన కంపెనీలు కూడా అనేక మోడళ్ల ఈవీ స్కూటర్లను ప్రస్తుతం అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే ఇటీవల ఈవీ స్కూటర్ల మార్కెట్‌లో ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అమ్మకాలపరంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కానీ కొత్తగా ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఏ స్కూటర్ బెటర్? అనే విషయంలో ఇప్పటికీ అనుమానంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్  మోడల్స్ మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

పరికరాలు, ఫీచర్లు

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ట్విన్ రియర్ షాక్‌లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ , వెనుకవైపు డ్రమ్ బ్రేక్, 12 అంగుళాల టైర్లు, 7 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటివి ఆకట్టుకుంటున్నారు. ఫీచర్ల పరంగా ఐక్యూబ్ ఎస్ పార్క్ అసిస్ట్, జియో-ఫెన్సింగ్, థెఫ్ట్ అలర్ట్, యూఎస్‌బీ ఛార్జర్, మ్యూజిక్ కంట్రోల్‌తో ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఓలా ఎస్ ఎక్స్ ప్లస్ స్కూటర్ కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ మాదిరిగానే సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. అయితే బ్రేకింగ్ ఫ్రంట్‌లో ఇది రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ చిన్న 5-అంగుళాల ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు సైడ్ స్టాండ్ వార్నింగ్, ఫోన్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, జీపీఎస్ కనెక్టివిటీ, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్‌తో వస్తుంది. 

బ్యాటరీ, పరిధి, పనితీరు

రెండు స్కూటర్ల బ్యాటరీ స్పెసిఫికేషన్స్‌ను పరిశీలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ స్కూటర్ 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఆధారంగా పని చేస్తుంది. ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 100కిమీ పరిధిని అందిస్తుంది. మోటారు 78 కేఎంపీహెచ్ గరిష్ట వేగాన్ని సాధించడంలో సహాయపడుతుంది. అలాగే ఐక్యూబ్ 4.2 సెకన్లలో 0 నుంచి 40 కేఎంపీహెచ్ వేగంతో దూసుకుపోతుంది. ఓలా ఎస్ ఎక్స్ ప్లస్ 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌ను పూర్తి ఛార్జ్‌ చేస్తే 125 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది ఈ స్కూటర్ మూడు రైడ్ మోడ్‌లతో వస్తుంది. అలాగే 3.3 సెకన్లలో 0 నుంచి 40కేఎంపీహెచ్‌ను అందుకుంటుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్టంగా 90 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

ది బెస్ట్ స్కూటర్ ఏదంటే? 

ఫీచర్ల విషయంలో రెండు స్కూటర్లను పోల్చి చూస్తే ఓలా మరిన్ని ఫీచర్లు, ఎక్కువ శ్రేణి, మెరుగైన పనితీరు, ఐక్యూబ్ కంటే తక్కువ ధరలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రసిద్ధ తయారీదారు నుంచి సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఐక్యూబ్ ఎస్ మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ట్రెండీ స్కూటర్ కోసం చూసే వారికి ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ యూత్‌ను ఆకర్షిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో