Personal Finance: ఏప్రిల్ 1 నుంచి ఆ రూల్స్ మారాయోచ్చ్..! అవేంటో తెలుసుకోపోతే మీ జేబుకు చిల్లే..
పన్ను శ్లాబులు, వినియోగదారు విభాగాల్లో అనేక నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఏడాది చాలా ముఖ్యమైన మార్పు ఏంటంటే కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఎంపికగా మారుతుంది.

ప్రస్తుతం కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1ను ఆ ఏడాది ఫైనాన్సియల్ ఇయర్ మొదలయ్యే రోజుగా పరిగణిస్తారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే వివిధ ఆర్థికపరమైన నిర్ణయాలు ఈ రోజు నుంచే ప్రారంభం అవుతాయి. పన్ను శ్లాబులు, వినియోగదారు విభాగాల్లో అనేక నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఏడాది చాలా ముఖ్యమైన మార్పు ఏంటంటే కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఎంపికగా మారుతుంది. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను లేదు. ఎల్‌టీసీజీ పన్నుపై ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగింపు వల్ల ఇప్పటికే ఉన్న లేదా కొత్త పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి మారే కొత్త నియమాలు ఏంటో ఓ సారి చూద్దాం.
- మారిన నియమాలు ఇవే
- కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఎంపికగా మారుతుంది.రూ. 7 లక్షల వరకూ పన్ను నుంచి మినహాయింపు
- 87ఏ కింద మినహాయింపు రూ.25,000కి పెరుగుతుంది.
- పదవీ విరమణపై లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది.
- డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీప్రయోజనం తొలగింపు.
- ఎన్ఎస్ఈ లావాదేవీ రుసుము 6 శాతం పెంపును వెనక్కి తీసుకోనుంది.
- వార్షిక ప్రీమియంలు రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న బీమా పాలసీలపై పన్ను.
- రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఈపీఎఫ్ఓ విరాళాలపై పన్ను.
- రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి లావాదేవీలపై మూలధన లాభాల పన్ను.
- ఆన్‌లైన్ గేమింగ్ బహుమతుల కోసం దరఖాస్తు చేయడానికి టీడీఎస్ విధింపు.
- ఇన్సూరెన్స్ కాస్ కమీషన్ ఈఓఎం కింద ఉండాలి.
- ఆటో కంపెనీలు ధరల పెంపు
- హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలపై ఆరు అంకెల హెచ్‌యూఐడీ కలిగి ఉండాలి.
- ఎక్స్-రే యంత్రం దిగుమతి పై 15 శాతం ధర పెంపు.
- మందుల ధరలు కూడా 12 శాతం పెరుగుదల.
- సిగరెట్లు, పాన్ మసాలా & ఇతర పొగాకు ఉత్పత్తుల ధరల పెంపు
- ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై 18 శాతం అధిక టోల్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి