FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ.. ఇవిగో పూర్తి వివరాలు..

బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిల్లో కన్నా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఎన్బీఎఫ్సీ)లో ఫిక్స్ డ్ డిపాజిట్ ప్రారంభిస్తే మంచి వడ్డీ రేటు లభిస్తుంది. బ్యాంకుల్లో కన్నా ఎన్బీఎఫ్సీల్లోనే అధిక వడ్డీ రేటు ఉంటుంది. అయితే వీటిల్లో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఇవి ప్రైవేటు బ్యాంకులు కాబట్టి, కాస్త ఇబ్బంది ఉండొచ్చు.

FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ.. ఇవిగో పూర్తి వివరాలు..
Fd
Follow us
Madhu

|

Updated on: May 06, 2024 | 5:17 PM

మీకు ఎటువంటి రిస్క్ లేకుండా కచ్చితమైన ఆదాయాన్నిచ్చే బెస్ట్ పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). మరే ఇతర పథకాలలో లేని విధంగా వీటిల్లో స్థిరమైన వడ్డీ రేటు ఉంటుంది. అంతేకాక సీనియర్ సిటిజెన్స్ మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. సాధారణ వ్యక్తుల కన్నా సీనియర్ సిటిజెన్స్ కు అధిక వడ్డీ రేటు కూడా అందిస్తుంది. అందుకే బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిల్లో కన్నా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఎన్బీఎఫ్సీ)లో ఫిక్స్ డ్ డిపాజిట్ ప్రారంభిస్తే మంచి వడ్డీ రేటు లభిస్తుంది. బ్యాంకుల్లో కన్నా ఎన్బీఎఫ్సీల్లోనే అధిక వడ్డీ రేటు ఉంటుంది. అయితే వీటిల్లో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఇవి ప్రైవేటు బ్యాంకులు కాబట్టి, కాస్త ఇబ్బంది ఉండొచ్చు. దానిలోని నిబంధనలు, ఆ సంస్థపై వినియోగదారుల రివ్యూలను గమనించి వీటిల్లో ఎఫ్డీ ఖాతాలను ప్రారంభించాలి. ఈ నేపథ్యంలో మన దేశంలోని టాప్ ఎన్బీఎఫ్సీల్లో ఎఫ్డీ వడ్డీ రేట్ల గురించిచ ఇప్పుడు తెలుసుకుందాం..

బజాజ్ ఫిన్‌సర్వ్.. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంస్థలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు ఉంటాయి. ఒక్కో కాలపరిమితికి ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. సాధారణంగా ఇక్కడ ఎఫ్డీ 18 నెలలు, 22 నెలలు, 33 నెలలు, 44 నెలల కాల వ్యవధులపై తీసుకునే ఎఫ్డీలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. వడ్డీ రేట్లు కాలవ్యవధిలో సంవత్సరానికి 7.40 శాతం నుంచి 8.25 శాతం మధ్య ఉంటాయి. 18 నెలల ఎఫ్డీపై వడ్డీ రేటు 7.8 శాతం, 22 నెలల ఎఫ్డీపై వడ్డీ రేటు 7.9 శాతం, 33 నెలల ఎఫ్డీపై వడ్డీ రేటు 8.10 శాతం ఉంటుంది. అలాగే 44 నెలల ఎప్డీపై గరిష్ట వడ్డీ 8.25 శాతం అందుతుంది.

ముత్తూట్ క్యాపిటల్.. ఈ ఎన్బీఎఫ్సీలో ఫిక్స్ డ్ డిపాజిట్ పై ఏడాదికి 7.45 నుంచి 8.5 శాతం వరకు వడ్డీని అందుకోవచ్చు. ఒక సంవత్సరానికి ఎన్బీఎఫ్సీలో 7.45 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 15 నెలలకు వడ్డీ రేటు 8.5 శాతానికి పెరుగుతుంది. రెండేళ్లకు రేటు 8 శాతం, మూడేళ్లకు ఇది 8.5 శాతం, ఐదు సంవత్సరాలకు ఇది 7.5 శాతంగా ఉంటుంది. .

శ్రీరామ్ ఫైనాన్స్.. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంస్థలో సంవత్సరానికి 7.85 నుంచి 8.8 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. ఒక సంవత్సరం ఎప్డీలో 7.85 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. రెండేళ్ల ఎప్డీపై, వడ్డీ రేటు 8.15 శాతం, 3 సంవత్సరాల ఎప్డీపై ఇది 8.70 శాతం ఉంటుంది. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై గరిష్టంగా 8.80 శాతం వడ్డీని అందిస్తారు.

మహీంద్రా ఫైనాన్స్.. ఈ ఎన్బీఎఫ్సీలో ఫిక్స్ డ్ డిపాజిట్ పై 7.75 నుంచి 8.05 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. 15 నెలల కాలవ్యవధిపై వడ్డీ రేటు 7.75 శాతం, 30 నెలలకు వడ్డీ రేటు 7.9 శాతం, 42 నెలలకు వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది.

ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్.. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంస్థలో ఎఫ్డీపై వడ్డీ రేటు 7.25 నుంచి 7.65 శాతం వరకు అందిస్తుంది. 12 నుంచి 24 నెలల మధ్య కాల వ్యవధి డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.25 శాతం. 24 నుంచి 36 నెలల మధ్య కాలంలో ఇది 7.55 శాతానికి పెరుగుతుంది. పదవీకాలం 36 నుంచి 60 నెలల మధ్య ఉన్నప్పుడు, వడ్డీ రేటు 7.65 శాతం ఉంటుంది. పదవీకాలం 60 నెలలు దాటిన తర్వాత వడ్డీ తగ్గుతుంది. 72-120 నెలల మధ్య కాలపరిమితి కలిగిన ఎప్డీపై, వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..