AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Return: ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?

ప్రతి సంవత్సరం ఇన్‌కమ్‌ ట్యా్క్స్‌ ఫైల్‌ చేసేవారు చాలా రకాల విషయాల తెలుసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు అందుకు సంబంధించిన ఫారమ్స్‌ గురించి అవగాహన ఉండాలి. ఫారం-16 ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి యజమాని ద్వారా జీతం పొందే వ్యక్తులకు జారీ చేస్తారు. ఈ ఫారమ్ సాధారణంగా మే నాటికి అందించడం జరుగుతుంది. ఇది ఉద్యోగి..

Income Tax Return: ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
Itr
Subhash Goud
|

Updated on: May 06, 2024 | 4:21 PM

Share

ప్రతి సంవత్సరం ఇన్‌కమ్‌ ట్యా్క్స్‌ ఫైల్‌ చేసేవారు చాలా రకాల విషయాల తెలుసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు అందుకు సంబంధించిన ఫారమ్స్‌ గురించి అవగాహన ఉండాలి. ఫారం-16 ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి యజమాని ద్వారా జీతం పొందే వ్యక్తులకు జారీ చేస్తారు. ఈ ఫారమ్ సాధారణంగా మే నాటికి అందించడం జరుగుతుంది. ఇది ఉద్యోగి సంపాదించిన జీతం, యజమాని జీతం నుండి తీసివేయబడిన పన్ను గురించి సమాచారాన్ని అందిస్తుంది. యజమాని టీడీఎస్‌ డిపాజిట్ చేసినట్లు ఫారం-16 నిర్ధారిస్తుంది. ఇది కంపెనీ టీఏఎన్‌ నంబర్, అసెస్‌మెంట్ సంవత్సరం, ఉద్యోగి పాన్‌, చిరునామా, జీతం బ్రేక్‌డౌన్, పన్ను విధించదగిన ఆదాయం మొదలైన వాటి గురించి కూడా సమాచారాన్ని కలిగి ఉంటుంది. మీరు డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టి, దాని గురించి కంపెనీకి తెలియజేసి ఉంటే ఈ సమాచారం కూడా ఉంటుంది.

ఫారం-16 అందుబాటులో లేకపోతే ఏమి చేయాలి?

ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి ఫారం-16 అందుబాటులో లేకుంటే వార్షిక సమాచార ప్రకటన (AIS), ఫారం 26ఏఎస్‌ కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండు ఫారమ్‌లు మొత్తం ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారు చేసిన అన్ని లావాదేవీలు, సంపాదించిన మొత్తం ఆదాయం, పెట్టుబడులు, కంపెనీ తీసివేయబడిన టీడీఎస్‌ పూర్తి వివరాలను కలిగి ఉంటాయి. వీటిని సరిపోల్చడం ద్వారా పన్ను చెల్లింపుదారు ఎలాంటి పొరపాటు చేయకుండా ఐటీఆర్‌ని పూరించవచ్చు. ఐఏఎస్‌, ఫారం 26ఏఎస్‌ను ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మీ ఏఐఎస్‌ని ఎలా తనిఖీ చేయాలి?

  • మీ వార్షిక సమాచార ప్రకటన (AIS)ను యాక్సెస్ చేయడానికి www.incometax.gov.inలో ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి. ‘సర్వీసెస్’ ట్యాబ్ ద్వారా AIS (వార్షిక సమాచార ప్రకటన) పేజీకి వెళ్లండి.
  • ‘ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఇది మిమ్మల్ని సమ్మతి పోర్టల్‌కి దారి మళ్లిస్తుంది. మీరు AIS హోమ్ పేజీలో TIS, వార్షిక సమాచార ప్రకటన (AIS)ని వీక్షించవచ్చు.
  • ఇప్పుడు సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోండి. అలాగే మీరు ఇక్కడ పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS) లేదా వార్షిక సమాచార ప్రకటన (AIS) చూడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి