AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ పీఎఫ్ ఖాతాలో తప్పులున్నాయా? టెన్షన్ వద్దు.. ఇలా ఈజీగా సరిచేసుకోవచ్చు..

పీఎఫ్ ఖాతాలో చందాదారుడి వివరాలన్నీ నమోదు చేస్తారు. అవి సక్రమంగా ఉంటేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. అయితే ఒక్కోసారి పేరు, ఇతర వివరాలలో తప్పులు దొర్లుతాయి. వాటిని సరిచేసుకోవడం చాలా అవసరం. గతంలో ఇలాంటి మార్పులు చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది. చందాదారులు తమ యజమాని సంతకం చేసిన తర్వాత జాయింట్ డిక్లరేషన్ ఫాం సమర్పించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ పని చాలా సులభతరమైంది.

EPFO: మీ పీఎఫ్ ఖాతాలో తప్పులున్నాయా? టెన్షన్ వద్దు.. ఇలా ఈజీగా సరిచేసుకోవచ్చు..
Epfo
Madhu
|

Updated on: Jun 02, 2024 | 7:23 PM

Share

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల, కార్మికుల భవిష్యత్తు అవసరాల కోసం ఏర్పాటు చేసిన పథకం. దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) నిర్వహిస్తుంది. ఈ పథకంలో చేరిన చందాదారుల జీతం నుంచి ప్రతినెలా కొంత మొత్తం మినహాయిస్తారు. ఆ ఉద్యోగి విరమణ అనంతరం పెద్ద మొత్తంలో అందజేస్తారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగించడానికి ఇది ఉపయోగపడుతుంది.

తప్పులు దొర్లితే..

పీఎఫ్ ఖాతాలో చందాదారుడి వివరాలన్నీ నమోదు చేస్తారు. అవి సక్రమంగా ఉంటేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. అయితే ఒక్కోసారి పేరు, ఇతర వివరాలలో తప్పులు దొర్లుతాయి. వాటిని సరిచేసుకోవడం చాలా అవసరం. గతంలో ఇలాంటి మార్పులు చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది. చందాదారులు తమ యజమాని సంతకం చేసిన తర్వాత జాయింట్ డిక్లరేషన్ ఫాం సమర్పించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ పని చాలా సులభమైంది. కేవలం ఆన్ లైన్ లో చాలా ఈజీగా మార్పులు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో సులభం..

ఇలాంటి మార్పుల కోసం ఈపీఎఫ్ఓ ఒక సిస్టమేటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను విడుదల చేసింది. దీనిద్వారా మన పీఎఫ్ ఖాతాలో సుమారు 11 రకాల మార్పులను ఆన్ లైన్ లో చాలా సులభం చేసుకోవచ్చు. సభ్యుడి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి / తల్లి పేరు, రిలేషన్, వైవాహిక స్థితి, చేరిన తేదీ, ఉద్యోగం మానివేయడానికి కారణం, మానివేసిన తేదీ, జాతీయత, ఆధార్ కార్డు తదితర వాటిలో మార్పులు సాధ్యమవుతాయి.

పీఎఫ్ ఖాతాలో మార్పుల కోసం అనుసరించాల్సిన పద్ధతులు..

  • ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్‌కు వెళ్లండి.
  • సర్వీసెస్ లోని ఫర్ ఎంప్లాయిస్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి, మెంబర్ యూఏఎన్/ ఆన్‌లైన్ సర్వీస్ లోకి వెళ్లండి.
  • యూఏఎన్, పాస్ వర్డ్, క్యాప్చా నమోదు చేసి, లాగిన్ అవ్వండి.
  • ఈపీఎఫ్ ఖాతా ఓపెన్ అయిన తర్వాత ఎగువ ఎడమ పానెల్‌లో ‘మేనేజ్’ ట్యాబ్‌ లోకి వెళ్లి, జాయింట్ డిక్లరేషన్ పై క్లిక్ చేయండి.
  • మీరు మార్చాలనుకుంటున్న మెంబర్ ఐడీని ఎంచుకోండి.
  • మార్పులను ధ్రువీకరించే పత్రాలను అప్ లోడ్ చేయాలి.
  • ఈ ప్రోసెస్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మీ అభ్యర్థన యజమానికి వెళుతుంది.

యజమాని చేయాల్సిన పని..

  • మీ అభ్యర్థన యజమానికి వెళ్లిన తర్వాత అతడు ఈ కింద విధంగా దానిని ఆమోదించాలి.
  • ముందుగా యజమాని తన ఐడీని నమోదు చేయాలి.
  • మెంబర్ ట్యాబ్‌కి వెళ్లి, జాయింట్ డిక్లరేషన్ మార్పు అభ్యర్థనను ఎంచుకోవాలి.
  • ఉద్యోగి చేసిన అభ్యర్థన, దానికి అవసరమైన రికార్డులను తనిఖీ చేయాలి.
  • ఉద్యోగి అభ్యర్థనను అంగీకరించవచ్చు. లేదా తిరస్కరించే హక్కు అతడికి ఉంటుంది.
  • యజమాని అభ్యర్థనను ఆమోదించిన తర్వాత, ఈపీఎఫ్ వోకి వెళుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..