Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Buying: కొత్త బైక్ కొంటున్నారా? వీటిని చెక్ చేసుకోకపోతే చాలా నష్టపోతారు..

కొత్త బైక్‌ను కొనుగోలు చేయడానికి వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. బైక్ బ్రాండ్ విలువ, నిర్వహణ ఖర్చులు, రీ సేల్ విలువ, సర్వీస్ సెంటర్ల లభ్యత, విడిభాగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పేరున్న బ్రాండ్ నుంచి బైక్‌ను కొనుగోలు చేయడం వల్ల వాహనం నాణ్యతపై మీకు హామీ లభిస్తుంది.

Bike Buying: కొత్త బైక్ కొంటున్నారా? వీటిని చెక్ చేసుకోకపోతే చాలా నష్టపోతారు..
Bikes
Follow us
Madhu

|

Updated on: May 31, 2023 | 5:00 PM

ద్విచక్ర వాహనం మనిషికి ఓ నిత్యావసరం. సిటీ అవసరాలకు, ఇంటి పనులకు తప్పనిసరిగా ఓ బైక్ లేదా స్కూటర్ ఉండాలని అందరూ కోరుకొంటారు. అలాగే కొంతమంది వాటిపైనే ఉద్యోగాలకు, పనులకు వెళ్తుంటారు. ఇంకొంత మంది బైక్ లపైనే స్నేహితులతో కలిసి లాంగ్ టూర్లకు వెళ్తుంటారు. మరికొంతమందికి మంచి కాస్ట్లీ బైక్ ఉంటే అది స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అవసరం ఏదైనా ఇంట్లో బైక్ మాత్రం తప్పనిసరి. అయితే అటువంటి బైక్ కొనుగోలులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అంశాలను సరిచూసుకోవాలి. లేకుంటే నష్టం తప్పదు. అవేంటో ఓసారి చూద్దాం..

అవగాహన, భద్రత.. కొత్త బైక్‌ను కొనుగోలు చేసే ముందు, మన రోడ్లపై రైడింగ్‌కు సంబంధించిన నియమాలు, నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. ఎందుకంటే ఇది మన దేశంలో తప్పనిసరి. మీరు సురక్షితమైన రైడర్ అయినప్పటికీ, మీరు రోడ్లను చాలా మందితో కలిసి పంచుకుంటారని గుర్తుంచుకోవడం ముఖ్యం. కాబట్టి, భద్రత మీ మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. తప్పనిసరిగా కొత్త బైక్‌కు బీమా చేయించుకోవాలి.

మీ అవసరం ఏమిటి.. కొత్త మోటార్‌సైకిల్‌ను పొందడం ఒక ఉత్తేజకరమైన అనుభవంగా ఉంటుంది. అయితే ముందుగా మీ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. విభిన్న ఆకారాలు, పరిమాణాలలో అందుబాటులో ఉన్న మోడల్‌ల శ్రేణితో, మీ అవసరాలకు అనుగుణంగా ఒకదాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారి అవసరాలు ఒక విధంగా ఉంటాయి. అలాగే సిటీ పరిధిలో ప్రయాణించే వారి అవసరాలు మరో విధంగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

మీ బడ్జెట్ కు అనుగుణంగా.. మీ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ను సెట్ చేయడం ముఖ్యం. కొత్త బైక్ కొనుగోలు చేయడం వల్ల మీరు నష్టపోకూడదు. మీ బడ్జెట్ కు మించిన ధరలో బైక్ ఉండకూడదు. బైక్ ధరతో పాటు, రిజిస్ట్రేషన్ ఫీజులు,రోడ్డు పన్నులు వంటి అదనపు ఖర్చులకు కూడా మీరు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

మైలేజీ.. కొత్త బైక్‌ను కొనుగోలు చేసేటప్పుడు మైలేజీని పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నందున , వాహనం నడపడానికి అయ్యే ఖర్చు భారంగా ఉంటుంది. అందువల్ల, అధిక మైలేజీని అందించే మోటార్‌సైకిల్ చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. అలాంటి వాహనం తక్కువ ఇంధనాన్ని ఉపయోగించి ఎక్కువ దూరం ప్రయాణించగలదు, పెట్రోలు లేదా డీజిల్‌పై ఖర్చు ఆదా అవుతుంది.

ఇంజిన్ సామర్థ్యం.. ఇంజిన్ పవర్ లేదా సీసీ ఎంపిక కూడా మీ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. రోజువారీ ప్రయాణాల కోసం, అధిక ట్రాఫిక్, రద్దీగా ఉండే రోడ్లపై అయినా ప్రయాణించాలనుకునేవారు తక్కువ సీసీ ఉన్న బైక్ మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఒకవేళ మీరు లాంగ్ రైడ్‌లు లేదా అడ్వెంచర్ ట్రిప్‌లను ప్లాన్ చేస్తుంటే, అధిక సీసీలు ఉన్న బైక్‌లు కొనుగోలు చేయాలి. అయితే అధిక సీసీ బైక్ ల ధరతో పాటు నిర్వహణ, ఇంధనఖర్చు,బీమా ఖర్చు అన్ని ఎక్కువగానే ఉంటాయని గుర్తుంచుకోవాలి.

స్టైల్.. మార్కెట్లో అనేక బైక్ మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, సౌకర్యం, భద్రత, బడ్జెట్‌లో రాజీ పడకుండా మీ అవసరాలను తీర్చేదాన్ని ఎంచుకోవడం చాలా కీలకం. ఉదాహరణకు, బజాజ్ డొమినార్ 400 సీటింగ్ పొజిషన్ కేటీఎం డ్యూక్ 350 లేదా అపాచీ ఆర్టీఆర్ 310కి భిన్నంగా ఉంటుంది. కొన్ని మోడల్‌లు రిలాక్స్డ్ సిట్టింగ్ భంగిమను కలిగి ఉంటాయి. మరికొన్ని నిటారుగా ఉండే భంగిమను కలిగి ఉంటాయి. అదేవిధంగా, తక్కువ సీసీ బైక్‌లు వాటి సొంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి.

చివరిగా..

కొత్త బైక్‌ను కొనుగోలు చేయడానికి వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. పైన పేర్కొన్న అంశాలే కాకుండా, మీరు బైక్ బ్రాండ్ విలువ, నిర్వహణ ఖర్చులు, రీ సేల్ విలువ, సర్వీస్ సెంటర్ల లభ్యత, విడిభాగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పేరున్న బ్రాండ్ నుండి బైక్‌ను కొనుగోలు చేయడం వల్ల వాహనం నాణ్యతపై మీకు హామీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..