Ola Cabs: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా నుంచి కొత్త సర్వీస్ ప్రారంభం.. డ్రైవర్లు ఇక ఆ పని చేయలేరు..
ఓలా క్యాబ్స్ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఉత్తమమైన రైడింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకు అనేక ఫీచర్లు, సర్వీసులు ప్రవేశపెడుతోంది. ఈక్రమంలో మరో సరికొత్త సర్వీస్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవం క్యాబ్ సిస్టమ్. దీనిలో ఓలా క్యాబ్స్ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఉత్తమమైన రైడింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకు అనేక ఫీచర్లు, సర్వీసులు ప్రవేశపెడుతోంది. ఈక్రమంలో మరో సరికొత్త సర్వీస్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రైమ్ ప్లస్ పేరుతో కొత్త ప్రీమియం సర్వీస్ ను కస్టమర్లకు అందించేందుకు టెస్టింగ్స్ ప్రారంభించింది. ఈ విషయాన్ని ఓలా సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ ధ్రువీకరించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ ప్రైమ్ ప్లస్ సర్వీస్ టెస్టింగ్ కు సంబంధించిన వివరాలు పోస్ట్ చేశారు. బెంగళూరులో ప్రైమ్ ప్లస్ సర్వీస్ వినియోగించుకున్న స్క్రీన్ షాట్ ను కూడా ఆయన ఆ పోస్టులో యాడ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బెంగళూరులో ప్రారంభం..
బెంగళూరులోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే ఈ ఓలా ప్రైమ్ ప్లస్ సర్వీస్ ను అందిస్తున్నట్లు ఓలా సీఈఓ తెలిపారు. ప్రస్తుతం ఈ సర్వీస్ టెస్టింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఆయనేం చెప్పారంటే.. ‘ఓలా క్యాబ్స్ ద్వారా కొత్త ప్రీమియం సేవను ప్రారంభించాలని అనుకుంటున్నాం ! ప్రైమ్ ప్లస్ ద్వారా ఉత్తమ డ్రైవర్లు, టాప్ కార్లతో క్యాన్సిలేషన్ లాంటి అవాంతరాలు లేకుండా ఈ సేవలు ప్రారంభించాలి అనుకుంటున్నాం. ఈరోజు బెంగళూరులో ఎంపిక చేసిన కస్టమర్ల కోసం దీనిని ప్రారంభిస్తున్నాం. ఓసారి ప్రయత్నించి చూడండి. నేను దీన్ని తరచుగా ఉపయోగిస్తాను. ట్విట్టర్‌లో నా అనుభవాలను పంచుకుంటాను.’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Testing out a new premium service by @Olacabs!
Prime Plus: Best drivers, top cars, no cancellations or operational hassles. Will go live for select customers in Bangalore today. Do try it out ???
I’ll be using it frequently and will share my experiences here on Twitter. pic.twitter.com/c8YDDgnbPU
— Bhavish Aggarwal (@bhash) May 28, 2023
డ్రైవర్లు క్యాన్సిల్ చేయలేరు..
అతను ఓలా యాప్‌లో ఎంపిక కోసం ప్రైమ్ ప్లస్ నిజానికి మనం క్యాబ్ బుక్ చేస్తుంటే కొన్ని సార్లు డ్రైవర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రైమ్ ప్లస్ సర్వీస్ లో అలా వారు క్యాన్సిల్ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. కచ్చితంగా క్యాబ్ బుక్ అయ్యేలా ఈ సదుపాయాన్ని తీసుకువస్తుండటం విశేషం. అలాగే సాధారణ చార్జీ కన్నా కొంత ఎక్కువ చార్జీ ఈ ప్రైమ్ ప్లస్ సర్వీస్ ద్వారా తీసుకుంటారు. అదే విషయాన్ని భవిష్ తన పోస్ట్ లో షేర్ చేసి స్క్రీన్ షాట్ చూపిస్తోంది. అయితే కొత్తగా రానున్న ఎలక్ట్రిక్ వాహన క్యాబ్ లలో ఈ సర్వీస్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..