AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best sports bikes: మంచి మైలేజీ ఇచ్చే స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నారా..? వీటిని ఒక్కసారి పరిశీలించాల్సిందే

ప్రస్తుతం మన దేశంలో స్పోర్ట్స్ బైక్ లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. విద్యార్థులు, యువతతో పాటు ఉద్యోగస్తులు కూడా వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ లుక్ తో ఇవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే స్పోర్ట్స్ బైక్ ను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మైలేజీ గురించే ఎక్కువగా ఆలోచిస్తాం.

Best sports bikes: మంచి మైలేజీ ఇచ్చే స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నారా..? వీటిని ఒక్కసారి పరిశీలించాల్సిందే
Super Bike Riding
Nikhil
|

Updated on: Jun 27, 2025 | 4:30 PM

Share

సాధారణంగా ఆ బైక్ లు చాలా తక్కువ మైలేజీ ఇస్తాయి. ఆ కారణంతో చాలా మంది వాటిని కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తారు. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. మంచి మైలేజీ, మెరుగైన నాణ్యతతో పలు స్పోర్ట్స్ బైక్ లు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. వాటి పనితీరు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.

యమహా ఆర్ 15 వీ4

దూకుడు, స్లైల్, మైలేజీ కోరుకునే వారికి యమహా ఆర్ 15 వీ4 మోటారు సైకిల్ చాలా బాగుంటుంది. దీనిలోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ నుంచి 18.1 బీహెచ్ పీ శక్తి, 14.2 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. రేస్ బైక్ ఆకారంలో నిటారుగా ఉండే ఎర్గోనామిక్స్ తో రూపొందించారు. స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపిస్తున్నా మైలేజీ విషయంలో ఎక్కడా రాజీ పడదు. లీటర్ కు 45 కిలోమీటర్ల ఇచ్చే ఈ బైక్ ను రూ.1.89 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

కేటీఎం ఆర్ సీ 200

చూడగానే ఆకట్టుకోవడంతో పాటు రైడింగ్ కు అనుకూలంగా ఉండే బైక్ లలో కేటీఎం ఆర్ సీ 200 ఒకటి. ఇది స్లైలిష్ లుక్ తో అదరగొడుతున్న స్పోర్ట్స్ మోటార్ సైకిల్. దీనిలోని 199.5 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ నుంచి 24.6 బీహెచ్ పీ శక్తి, 19.2 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. అడాప్టివ్ ఎర్గోనామిక్స్, తక్కువ బరువుతో ఈ బైక్ ను నడపడం చాాలా సులభం. లీటర్ పెట్రోలుకు 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ రూ.2.54 లక్షల ధరకు అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

సుజుకీ జిక్సర్ ఎస్ఎఫ్

నగర ప్రయాణాలతో పాటు జాతీయ రహదారులపై రైడింగ్ కు సుజుకీ జిక్సర్ ఎస్ఎఫ్ చాలా బాగుంటుంది. సౌకర్యంతో పాటు రైడింగ్ తో ఉత్సాహాన్నిస్తుంది. దీనిలో 155 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. దాని నుంచి 13.4 బీహెచ్ పీ శక్తి, 13.8 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. ఈ బండి సుమారు 45 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మార్కెట్ లో రూ.1.47 లక్షలకు ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

ప్రముఖ కంపెనీ బజాజ్ నుంచి విడుదలైన పల్సర్ ఆర్ఎస్ 200 స్పోర్ట్స్ బైక్ సూపర్ లుక్ తో ఆకట్టుకుంటోంది. స్టైల్, కంఫర్ట్ తో పాటు మైలేజీ కోరుకునే వారికి చక్కగా సరిపోతుంది. ఈ బైక్ 199.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో నడుస్తుంది. 24.1 బీహెచ్ పీ శక్తి, 18.6 గరిష్ట టార్కును విడుదల చేస్తుంది. ముఖ్యంగా కొత్త రైడర్లు కూడా సునాయాసంగా నడపొచ్చు. సుమారు 35 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బైక్ ను రూ.1.85 ధరకు కొనుగోలు చేయవచ్చు.

యమహా ఆర్15ఎస్

యువతకు ఎంతో ఇష్టమైన కంపెనీలలో యమహా ముందు వరసలో ఉంటుంది. ఆ కంపెనీ నుంచి విడుదలైన ఆర్ 15ఎస్ బైక్ మంచి లుక్ తో సూపర్ గా కనిపిస్తోంది. రోజు వారీ అవసరాలకు చక్కగా సరిపోతుంది. నగరాలతో పాటు పర్యటనలకు కూడా నప్పుతుంది. దీనిలోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ నుంచి 18.1 బీహెచ్ పీ శక్తి, 14.2 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. సుమారు 51 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడం దీని ప్రత్యేకం. ఈ బైక్ రూ.1.67 లక్షలకు అందుబాటులో ఉంది.

బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్

మిగిలిన బైక్ లతో పోల్చితే బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ ధర ఎక్కువై అయినప్పటికీ పనితీరు విషయంలో చాలా మెరుగ్గా ఉంటుంది. స్టైలిష్ లుక్ తో కనువిందు చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. దీనిలో 312.22 సీసీ వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ట్రాక్ \ స్పోర్ట్ మోడ్ లో 33.5 బీహెచ్ పీ, 27.3 ఎన్ ఎం టార్కు విడుదల చేస్తుంది. సిటీ పట్టణ మోడ్ లో 25.4 బీహెచ్ పీ, 25 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. సుమారు 31 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బైక్ ను రూ.3.05 లక్షలకు అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి