AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education loans: నర్సరీ చదువుకూ విద్యారుణం.. ఫీజుల భారానికి టాటా చెప్పేయండి..!

సాధారణంగా మన దేశంలో ప్రముఖ కళాశాలలు, విదేశాల్లోని యూనివర్సిటీల్లో చదువుల కోసం బ్యాంకులు విద్యా రుణాలు మంజూరు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వీటి ద్వారా ఆయా కళాశాలల్లో యువత చదువు పూర్తి చేసుకునే వీలుంటుంది. చదువు పూర్తయ్యి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతి నెలా వాయిదాల రూపంలో ఆ రుణాన్ని తీర్చవచ్చు. అయితే నర్సరీ నుంచి 12వ తరగతి చదువు కోసం కూడా బ్యాంకులు విద్యారుణాలను మంజూరు చేస్తాయి. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఆ వివరాలు, రుణం పొందే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Education loans: నర్సరీ చదువుకూ విద్యారుణం.. ఫీజుల భారానికి టాటా చెప్పేయండి..!
Education Loan
Nikhil
|

Updated on: Jun 27, 2025 | 4:15 PM

Share

ప్రస్తుతం పిల్లల స్కూలు ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక మోస్తరు పేరున్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. సామాన్యుల విషయం పక్కన పెడితే, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా వీటిని భరించలేకపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, నోయిడా, బెంగళూరుతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. అయితే పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువే కాబట్టి..ఎంత ఖర్చయినా తల్లిదండ్రులు భరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పిల్లల చదువు కోసం బ్యాంకుల నుంచి విద్యా రుణాలు పొందే అవకాశం ఉంది.

మన దేశంలో నర్సరీ నుంచి 12వ వరకూ చదువు కోసం విద్యారుణాలు అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీతో పాటు కొన్ని ఆర్థిక సంస్థలు కూడా ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇవి పొందటానికి కింద తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

భారత పౌరసత్వం

విద్యారుణం తీసుకునే విద్యార్థి లేదా అతడి తల్లిదండ్రులు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. అయితే కొన్ని బ్యాంకులు భారతీయ పౌరసత్వ కలిగిన ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) విద్యార్థులకు రుణాలు ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

వయసు

విద్యార్థి వయసు మూడేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం విద్యార్థికి 16 ఏళ్లు ఉండాలనే నిబంధన విధించాయి.

పాఠశాల

సీబీఎస్ సీ, ఐసీఎస్సీ, రాష్ట్ర బోర్డులు, అంతర్జాతీయ బోర్డులతో అనుసంధానమైన, గుర్తింపు పొందిన స్కూళ్లలోనే చదవాలి. రుణం ఇవ్వడానికి ముందే ఆ పాఠశాలల గుర్తింపును బ్యాంకులు పరిశీలిస్తాయి.

సహ దరఖాస్తుదారు

స్థిరమైన ఆదాయం ఉన్న తల్లిదండ్రులు, లేదా చట్టపరమైన సంరక్షకులు సహ దరఖాస్తుదారుగా వ్యవహరించాలి.

ఆదాయ పరిమితి

సెంట్రల్ సెక్టార్ వడ్డీ సబ్సిడీ (సీఎస్ఐఎస్) తదితర పథకాల కింద రుణాలను పొందాలనుకుంటే ఆ విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలకు మించకూడదు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం రూ.8 లక్షల పరిమితి వరకూ అంగీకరిస్తాయి.

ఎన్ని లక్షల రుణమంటే..?

పాఠశాల విద్య కోసం మామూలుగా రూ.4 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం రూ.10 లక్షల వరకూ ఇస్తాయి. సాధారణంగా రూ.4 లక్షల రుణానికి పూచీకత్తు అవసరం లేదు. అయితే రూ.7.50 లక్షల వరకూ ఉన్న రుణాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్ఎస్ఈఎల్) కింద భద్రత కల్పిస్తారు. బోర్డింగ్ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల ప్రయాణ ఖర్చులకు, పుస్తకాలు, యూనిఫాం, విద్యా సామగ్రి కొనుగోలుకు, ట్యూషన్, హాస్టల్, పరీక్ష ఫీజు చెల్లింపునకు, ల్యాప్ టాప్, ఇతర ముఖ్యమైన పరికరాల కోసం విద్యా రుణాలను వినియోగించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి