FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై లేటెస్ట్‌ వడ్డీ రేట్లు ఇవే.. అత్యధిక వడ్డీ ఏ బ్యాంకులో అంటే..

సాధారణ పౌరుల కంటే సీనియర్‌ సిటిజెన్స్‌కు ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ రేటు ఎక్కువగా ఇస్తారు. అస్సలు రిస్క్‌ వద్దు అనుకునేవారికి ఇవి బెస్ట్‌ ఎంపిక. 5 సంవత్సరాల ఎఫ్‌డీపై ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఎఫ్‌డీల నెలల వ్యవధి నుంచి కొన్ని సంవత్సరాల వరకూ మెచ్యూరిటీ పరిధులను అందిస్తాయి. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై లేటెస్ట్‌ వడ్డీ రేట్లు ఇవే.. అత్యధిక వడ్డీ ఏ బ్యాంకులో అంటే..
Fd Deposit
Follow us

|

Updated on: Jul 11, 2024 | 11:45 AM

అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న పొదుపు పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ). ఇది నిర్ధేశిత కాల వ్యవధిలో కచ్చితమైన రాబడిని అందిస్తుంది. ఇందులో స్థిర వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంకు, పోస్టాఫీసు, స్మాల్‌ ఫైనాన్సింగ్‌ సంస్థల్లో ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి. ఏక మొత్తంలో దీనిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనిపై వచ్చే వడ్డీ మెచ్యూరిటీ సమయంలో అసలుతో పాటు ఇస్తారు. దీనిలో వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి మారుతుంటుంది. అయితే వడ్డీ రేటు అన్ని సంస్థల్లో ఒకేలా ఉండదు. ఎప్పుడైనా ఎఫ్‌డీ చేయాలనుకుంటే ముందు వడ్డీరేట్లను తెలుసుకోవడం ముఖ్యం.

ఎఫ్‌డీ ప్రయోజనాలు ఇవి..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు సురక్షిత పెట్టుబడి పథకాలు. దీనిలో ఎలాంటి రిస్క్‌ ఉండదు.వడ్డీ రేటు ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. నిర్ధేశిత సమయంలో ఎంత వస్తుందో ముందే అంచనా వేసుకోవచ్చు. మార్కెట్‌ అస్థిరత దీనిపై పడదు. ఎందుకంటే ఇది మార్కెట్‌ లింక్డ్‌ కాదు. అందుకే వీటిల్లో అధికంగా పెట్టుబడులు పడతారు. పైగా సాధారణ పౌరుల కంటే సీనియర్‌ సిటిజెన్స్‌కు ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ రేటు ఎక్కువగా ఇస్తారు. అస్సలు రిస్క్‌ వద్దు అనుకునేవారికి ఇవి బెస్ట్‌ ఎంపిక. 5 సంవత్సరాల ఎఫ్‌డీపై ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఎఫ్‌డీల నెలల వ్యవధి నుంచి కొన్ని సంవత్సరాల వరకూ మెచ్యూరిటీ పరిధులను అందిస్తాయి. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

  • సాధారణ పౌరులు: 400 రోజులకు 7.10%
  • సీనియర్ సిటిజన్లు: 400 రోజులకు 7.60%

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)..

  • సాధారణ పౌరుడు: 400 రోజులకు 7.25%
  • సీనియర్ సిటిజన్లు: 400 రోజులకు 7.75%

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)..

  • సాధారణ పౌరుడు: 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధికి 7.25%
  • సీనియర్ సిటిజన్లు: 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు పైబడిన వ్యవధికి 7.75%

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

  • సాధారణ పౌరులు: 18 నెలల నుంచి 21 నెలల లోపు వ్యవధికి 7.25%
  • సీనియర్ సిటిజన్లు: 18 నెలల నుంచి 21 నెలల లోపు వ్యవధికి 7.75%

ఐసీఐసీఐ బ్యాంక్..

  • సాధారణ పౌరులు: 15 నెలల నుండి 18 నెలల లోపు వ్యవధికి 7.20%
  • సీనియర్ సిటిజన్లు: 15 నెలల నుంచి 18 నెలల లోపు వ్యవధికి 7.75%

కెనరా బ్యాంక్..

  • సాధారణ పౌరులు: 444 రోజులకు 7.25%
  • సీనియర్ సిటిజన్లు: 444 రోజులకు 7.75%

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

  • సాధారణ పౌరులు: 399 రోజులకు 7.25%
  • సీనియర్ సిటిజన్లు: 399 రోజులకు 7.75%

యాక్సిస్ బ్యాంక్..

  • సాధారణ పౌరులు:17 నెలల నుంచి 18 లోపు కాల వ్యవధికి 7.20%
  • సీనియర్ సిటిజన్లు: 17 నెలల నుంచి 18 నెలల లోపు వ్యవధికి 7.85%

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్..

  • సాధారణ పౌరులు: 500 రోజులకు 7.90%
  • సీనియర్ సిటిజన్లు : 500 రోజులకు 8.40%

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్..

  • సాధారణ పౌరులు : 444 రోజులకు 7.30%
  • సీనియర్ సిటిజన్లు: 444 రోజులకు 7.80%

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..