మీరు రైలు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారా? నవంబర్‌ నుంచి కొత్త నిబంధనలు

20 October 2024

Subhash

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే టికెట్ల అడ్వాన్స్‌ టికెట్‌ రిజర్వేషన్‌ వ్యవధిని తగ్గింది. 

రైల్వే కీలక నిర్ణయం

ఇప్పటి వరకు ముందస్తు రిజర్వేషన్‌కు 120 రోజుల గడువు ఉండేది. దీన్ని 60 రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన నవంబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

 రిజర్వేషన్‌

అంతకు ముందు చేసుకున్న టికెట్ల బుకింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని రైల్వేశాఖ ప్రకటించింది. అక్టోబర్‌ 31 వరకు చేసిన అన్ని బుకింగ్స్‌ అలాగే ఉంటాయని తెలిపింది.

టికెట్ల బుకింగ్‌

విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితిలో ఎలాంటి మార్పు ఉండబోదని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

విదేశీ పర్యాటకులకు

తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌, గోమతి ఎక్స్‌ప్రెస్‌ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని.. ముందస్తు రిజర్వేషన్‌ ఇప్పటికే తక్కువ కాల పరిమితి ఉందని పేర్కొంది. 

ముందస్తు రిజర్వేషన్‌

ఇదిలా ఉండగా.. దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. నిత్యం లక్షల మంది రైల్వేలో ప్రయాణిస్తుంటారు.

భారత రైల్వే

ఏటా 30 నుంచి 35కోట్ల మంది రైల్వేలో ప్రయాణిస్తుంటారని అంచనా. టికెట్‌ ధర తక్కువ, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు.

 రైల్వేలో

దూర ప్రాంతాలకు వెళ్లేవారంతా ముందస్తుగా టికెట్లను రిజర్వేషన్‌ చేసుకుంటారు. ప్రస్తుతం 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే.

దూర ప్రాంతాలకు