17 October 2024
Subhash
ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ఇందులో చాలా మద్యం బాటిళ్లు రూ.99కే లభిస్తున్నాయి. దీతో మద్యం ప్రియుల్లో ఆనందం వెల్లువెత్తుతుంది.
కొత్త విధానం వల్ల మద్యం దుకాణాలు ఇప్పుడు మరో మూడు గంటల పాటు తెరిచి ఉంటాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయం.
మీరు ఏపీ నుంచి రైలులో మద్యం తీసుకురావాలని ఆలోచిస్తే 2 లీటర్ల వరకు మాత్రమే తీసుకురావచ్చు. అంతకు మించితే రూ.500 జరిమానా,6 నెలల జైలు శిక్ష.
మీరు కారులో మద్యం తీసుకువస్తున్నట్లయితే 1 లీటర్ మాత్రమే అనుమతి. ఇంతకంటే ఎక్కువ ఉంటే జరిమానా విధిస్తారు.
విమానంలో 5 లీటర్ల వరకు మద్యాన్ని తీసుకెళ్లవచ్చు. కాని అందులో ఆల్కహాల్ కంటెంట్ 70 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.
కొత్త విధానం ప్రకారం అనేక బ్రాండ్ల మద్యం చాలా చౌక ధరలకు అందుబాటులో ఉంటుంది. ఖరీదైన మద్యం కొనలేని వారికి ఇది ఎంతో మేలు.
కొత్త మద్యం పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2000 కోట్లకుపైగా ఆదాయం పొందుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని అంచనా.
రైలు, కారు, విమానాల్లో మద్యం తీసుకురావాలన్నా ప్రతి మద్యానికి దాని సొంత నియమాలు ఉంటాయి. చట్టపరమైన సమస్యలు లేకుండా నియమాలు పాటించాలి.