మహిళలకు షాక్‌.. పరుగులు పెడుతున్న బంగారం ధర.. లక్షదాటిన వెండి ధర

21 October 2024

Subhash

మరో పది రోజుల్లో దంతేరాస్ రానుంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది.

దంతేరాస్

సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.750 పెరిగి రూ.80,650 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 79,640 వద్ద ఉంది.

తులం ధర 

శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.79,900 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి ధర సైతం ఒకే రోజు రూ.5000 పుంజుకుని పైపైకి దూసుకెళ్తోంది. 

తులం బంగారం

వరుసగా నాలుగో రోజు కిలో వెండి ధర రూ.5000 వృద్ధితో రూ.99,500లకు చేరుకున్నది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,500 వద్ద ముగిసింది.

వరుసగా నాలుగో రోజు

పారిశ్రామిక రంగాల నుంచి డిమాండ్ రావడంతోపాటు బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. ఇక 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర సైతం రూ.750 పెరిగి రూ.80,250 వద్ద స్థిర పడింది. 

వెండి కూడా

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ కాంట్రాక్ట్స్ డెలివరీ తులం బంగారం ధర రూ.493 వృద్ధి చెంది రూ.78,340 వద్ద ముగిసింది. 

మల్టీ కమోడిటీ 

సోమవారం కిలో వెండి ధర రూ.2,822 పెరిగి రూ.1,09,000లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 34 డాలర్ల మార్కుకు చేరుకుంది. 

కిలో వెండి

కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 2744.30 డాలర్లు పలికింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్లే ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు మళ్లుతున్నారని ఇన్వెస్టర్లు చెబుతున్నారు.

 ఔన్స్ బంగారం