Car Insurance: బెస్ట్ కార్ ఇన్సురెన్స్ కావాలా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..
ఇన్సురెన్స్ పాలసీ మీ సొంతంగానే కొనుగోలు చేసుకోవడం మంచిది. డీలర్ అందించే పాలసీ కన్నా మీరు ఎంపిక చేసుకున్న పాలసీనే కాస్త తక్కువ ధరకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో మీకు సరైన, అధిక ప్రయోజనాలున్న పాలసీని ఎంపిక చేసుకునేందుకు అవసరమైన కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం. ఓసారి చదివేయండి..
కారు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ కార్ ఇన్సురెన్స్ కలిగి ఉండాలి. ఇది మన భారతదేశంలో తప్పనిసరి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 1988 చట్టం ప్రకారం ప్రతి కారు వినియోగదారుడు తన కారును రోడ్డుపై డ్రే చేయాలంటే కనీసం థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ కచ్చితంగా ఉండాలి. అంతేకాక యాజమని సెల్ఫ్ డ్యామేజ్ ఇన్సురెన్స్ కవర్ కూడా తీసుకోవచ్చు. మన దేశంలో వందలకొద్దీ ఇన్సురెన్స్ కంపెనీలు ఉన్నాయి. విభిన్న రకాల పాలసీలు, విభిన్న రకాల ఫీచర్లు అందిస్తుంటాయి. వాటిల్లో ఏది బెస్ట్ అంటే చెప్పడం కొంచెం కష్టమే. వినియోగదారులకు బాగా ఉపయోగపడే పాలసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. మీరు కొత్త కారు కొన్నా లేక, పాత కారు తీసుకున్నా ఇన్సురెన్స్ కోసం డీలర్లే మీకు తరచూ సాయం చేస్తుంటారు. మంచి ప్రయోజనాలున్న పాలసీని ఎంపిక చేసుకోవడంలో సాయపడతారు. అయితే ఆ సమయంలో పాలసీ ధర బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కార్ ఇన్సురెన్స్ పాలసీ మీ సొంతంగానే కొనుగోలు చేసుకోవడం మంచిది. డీలర్ అందించే పాలసీ కన్నా మీరు ఎంపిక చేసుకున్న పాలసీనే కాస్త తక్కువ ధరకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో మీకు సరైన, అధిక ప్రయోజనాలున్న పాలసీని ఎంపిక చేసుకునేందుకు అవసరమైన కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం. ఓసారి చదివేయండి..
మీ అవసరం ఏమిటో అర్థం చేసుకోండి.. మీరు పాలసీ కొనుగోలు చేసే ముందుకు మీకు ఎటువంటి అవసరం ఉంది అనేది మీరు అసెస్ చేసుకోవాలి. రెండు రకాల కార్ ఇన్సురెన్స్ పాలసీలు మన దేశంలో అందుబాటులో ఉంటాయి. ఒకటి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్, మరొకటి కాంప్రహెన్సివ్ ఇన్సురెన్స్. దీనిలో థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ అనేది చట్ట ప్రకారం తప్పనిసరి. దీంతో ఇతరుల మన బండికి చేసే డ్యామేజ్ కవర్ అవుతుంది. కాంప్రిహెన్సివ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకుంటే మీ కారు దొంగతనానికి గురైనా మీకు పాలసీ వర్తిస్తుంది. మీరు పాలసీ తీసుకునే ముందే తగిన విధంగా మీ అవసరాలు, మీ ఆర్థిక పరిమితులను సరిచూసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
వివిధ రకాల ప్లాన్లను సరిచూసుకోండి.. ఇంటర్ నెట్లో విభిన్న రకాల ప్లాన్లు వివిధ కంపెనీలకు చెందినవి మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని అసెస్మెంట్ చేసుకోవాలి. వాటిలో ప్రయోజనాలు, ధరలు.. సెటిల్మెంట్ రేషియో వంటివి చూసుకోవాలి.
యాడ్ ఆన్ కవరేజ్ ఉందా? చాలా పాలసీలు కొన్ని యాడ్ ఆన్ ప్రయోజనాలను అందిస్తాయి. అంటే అదనపు కవరేజ్ అంశాలను జోడిస్తారు. అందుకోసం కొంత మొత్తం ప్రీమియంపైన చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ యాడ్ ఆన్ కవరేజ్లు కాంప్రిహెన్సివ్ ఇన్సురెన్స్ పాలసీ ప్లాన్లలోనే ఉంటుంది.
క్లయిమ్ సెటిల్మెంట్ రేషియో(సీఎస్ఆర్).. పాలసీని ఎంపిక చేసుకునే మందు మీరు ప్రధానంగా సరిచూసుకోవాల్సిన అంశం ఇది. క్లయిట్ సెటిల్మెంట్ రేషియో(సీఎస్ఆర్) అనేది పాలసీలను అందించే కంపెనీ ఏడాదికి ఎన్ని పాలసీలు సెటిల్ చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. దీని సాయంతో వినియోగదారులకు ఆ కంపెనీ నుంచి ఎంత మొత్తంలో ప్రయోజనం చేకూరుతుందో అర్థం అవుతుంది.
నియమాలు, నిబంధనలు.. మీరు పాలసీ తీసుకునే ముందే దానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు తప్పనిసరిగా చదవాలి. వాటిని చదివి అర్థం చేసుకుంటేనే ఆ పాలసీ గురించి మీకు బాగా అర్థం అవుతుంది. దానిలో ప్రతి క్లాస్, కండిషన్స్ మీకు తెలుస్తాయి. అందులో నో క్లయిమ్ బోనస్ వస్తుందో రాదో కూడా దాని ద్వారానే తెలుస్తోంది. అంతేకాక చాలా కంపెనీలు నో క్లయిమ్ బోనస్ ను అందిస్తాయి. దీని సాయంతో తర్వాత సంవత్సరానికి చెల్లించే ప్రీమియంలో కొంత డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..