New Cars: ఈ కార్లకు జీరో వెయిటింగ్ పీరియడ్.. వెంటనే ఇంటికి తీసుకెళ్లొచ్చు.. పూర్తి వివరాలు
అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కారు కొనుగోలు చేయాలంటే ముందు అడ్వాన్స్ కట్టి కారు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీకి కాస్త వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత కారు మన ఇంటికి వస్తుంది. అయితే పండుగ సమయంలో అలాంటి వెయిటింగ్ పిరియడ్ ఉంటే ఇబ్బందిగా అనిపించవచ్చు. మరీ షోరూం కి వెళ్లి ఒకేసారి కారును ఇంటికి తెచ్చుకోవాలంటే ఎలా? అందుకే అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం..
మన దేశంలో కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా దసరా నవరాత్రుల నుంచి దీపావళి వరకూ మార్కెట్ కు మంచి జోష్ ఉంటుంది. సేల్స్ అత్యధికంగా జరుగుతాయి. కంపెనీలు కూడా ఈ ఫెస్టివ్ సీజన్లో ప్రకటించే ఆఫర్లను వినియోగించుకొని వినియోగదారులు ఉత్సాహంగా కొనుగోళ్లు చేస్తుంటారు. ఇదే మూడ్ నవంబర్ చివరి వరకూ ఉంటుంది. అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కారు కొనుగోలు చేయాలంటే ముందు అడ్వాన్స్ కట్టి కారు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీకి కాస్త వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత కారు మన ఇంటికి వస్తుంది. అయితే పండుగ సమయంలో అలాంటి వెయిటింగ్ పిరియడ్ ఉంటే ఇబ్బందిగా అనిపించవచ్చు. మరీ షోరూం కి వెళ్లి ఒకేసారి కారును ఇంటికి తెచ్చుకోవాలంటే ఎలా? అందుకు షోరూంలో కార్ల లభ్యత ఉండాలి. ప్రస్తుతం కొన్ని కార్లకు చాలా తక్కువ వెయిటింగ్ పిరియడ్ ఉంది. అలా అతి తక్కువ సమయంలోనే మన ఇంటికి వచ్చే కార్ల జాబితా ఇక్కడ ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం..
టాటా టియాగో.. ఈ కారు మన దేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి. ఇది కాంపాక్ట్ డిజైన్ లో ఉంటుంది. దీనిలో మూడు సిలెండర్ల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అలాగే సీఎన్జీ పవర్ ట్రైన్ కూడా ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్సులతో అందుబాటులో ఉంది. ఈ కారు మీరు జీరో వెయిటింగ్ పీరియడ్ తో వస్తుంది.
హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్.. ఇది టాటా టియాగో కేటగిరీలోకే వస్తుంది. ఈ కారు కూడా సౌత్ కొరియా కార మేకర్ అయిన హ్యూందాయ్ కి మంచి లాభాలు తెచ్చే పెట్టే కారు. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలలో వస్తుంది. మాన్యువల్, ఏఎంటీ ట్రాన్సిమిషన్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారను కనుక మీరు కొనుగోలు చేయాలనుకున్నా.. డబ్బు చెల్లించిన వెంటనే ఇంటికి తెచ్చేసుకోవచ్చు.
మారుతి సుజుకీ జిమ్నీ.. మారుతి సుజుకీ నుంచి 2023లో లాంచ్ అయిన ముఖ్యమైన కార్లలో ఇదీ ఒకటి. ఇది ఐదు డోర్లతో వస్తుంది. ఈ కారును ప్రత్యేకంగా మన దేశంలోనే డిజైన్, డెవలప్ మెంట్ చేశారు. దీని మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించారు. ఇది జీటా, ఆల్ఫా ట్రిమ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఎస్ యూవీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా చాలా తక్కువ వెయిటింగ్ పీరియడ్ తో మీకు లభ్యమవుతుంది.
రెనాల్ట్ క్విడ్.. ఈ ఫ్రెంచ్ కార్ మేకర్ మన దేశంలో లాంచ్ అయిన దగ్గర నుంచి మంచి సేల్స్ నే రాబట్టింది. అయితే 800సీసీ ఇంజిన్ కారును డిస్కటిన్యూ చేసిన తర్వాత ప్రస్తుతం ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ పవర్ ట్రైన్ తో అందుబాటులో ఉంది. ఇది కూడా మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ కారు కూడా ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండానే వినియోగదారులకు లభ్యమవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..