Business Idea: వింటర్ సీజన్‌లో సూపర్ బిజినెస్.. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం..
కేవలం మూడు నెలల వరకు వ్యాపారాన్ని చేయడం ఆ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఒక ట్రెండ్. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇలాంటి ఓ బెస్ట్ సీజనల్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చలికాలం వచ్చేసింది. మెల్లిమెల్లిగా చలి విజృంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్కీన్స్‌కు, ఉలెన్ దుస్తువులకు మార్కెట్లో...
ప్రస్తుతం వ్యాపార పద్ధతిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా ఒకే బిజినెస్‌ను ఏళ్లపాటు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. షార్ట్ అండ్ స్వీట్‌గా కొన్ని నెలలు మాత్రమే వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా సీజన్స్‌కి అనుగుణంగా చేసే వ్యాపారస్థుల సంఖ్య పెరుగుతోంది.
కేవలం మూడు నెలల వరకు వ్యాపారాన్ని చేయడం ఆ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఒక ట్రెండ్. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇలాంటి ఓ బెస్ట్ సీజనల్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చలికాలం వచ్చేసింది. మెల్లిమెల్లిగా చలి విజృంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్కీన్స్‌కు, ఉలెన్ దుస్తువులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. చలి నుంచి తట్టుకునేందుకు ప్రజలు ష్వటర్లను కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఈ సీజన్‌ను క్యాష్ చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు.
ఈ వ్యాపారం ద్వారా కేవలం 2 నుంచి 3 నెలల్లోనే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. జాకెట్స్, స్వెటర్లు, శాలువలు వంటి వాటిని విక్రయించడం ద్వారా లాభాలను పొందొచ్చు. అయితే స్వల్పకాలం వ్యాపారం చేయాలనుకునే వారు రిటైల్‌గా కాకుండా హోల్‌సేల్‌గా విక్రయించాలి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందొచ్చు. భారీ ఎత్తున దుస్తులను కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు హోల్‌సేల్‌లో అమ్మితే మంచి లాభాలను పొందొచ్చు. ప్రజల అభిరుచికి అనుగుణంగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఉన్ని దుస్తువులను విక్రయిస్తే నష్టం నుంచి తప్పించుకోవచ్చు.
ఇక ప్రస్తుతం ఈ కామర్స్ సైట్స్ కూడా వస్తువులను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తోంది కాబట్టి. మీరు ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఆన్‌లైన్‌లో వింటర్ దుస్తులను ఆన్‌లైన్‌లో కూడా అమ్ముకోవచ్చు. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 2 నుంచి రూ. 3 లక్షల ఆదాయం పెట్టుబడి పెడితే సరిపోతుంది. లేదు పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలనుకుంటే రూ. 7 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. తక్కువ ధరకు దుస్తులను కొనుగోలు చేయాలనుకుంటే. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మెరుగైన లాగిస్టిక్స్ సేవల వల్ల సరకుల రవాణ చాలా సులభతరంగా మారింది.
ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. దుస్తులను డంప్ చేసుకోవడానికి ఒక గోడౌన్ ఉండాలి. ముందుగా దుస్తులను గోడౌన్‌లో లేదా ఒక పెద్ద గదిలో డంప్ చేసుకొని అనంతరం అక్కడి నుంచి చిన్న చిన్న దుకాణాలకు సప్లై చేసుకోవచ్చు. ఇక కేవలం హోల్‌సేల్‌గానే కాకుండా రిటైల్‌గా కూడా విక్రయించుకోవచ్చు. ఈ దుస్తులపై సుమారు 30 నుంచి 40 శాతం వరకు లాభం పొందొచ్చు. ఈ లెక్కన సరిగ్గా ఒక్క మూడు నెలలు వ్యాపారం చేస్తే లక్షల్లో ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..