Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Special FD: ఎఫ్‌డీ చేస్తే ఈ బ్యాంకులోనే చేయాలి.. అత్యధిక వడ్డీ.. సూపర్ ప్రయోజనాలు

ఎస్బీఎం బ్యాంకు కూడా ప్రత్యేకమైన దివాళి ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇది భారతీయ పౌరులతో పాటు నాన్ రెసిడింట్ ఇండియన్స్ కూడా అందిస్తోంది. అయితే ఇది కేవలం పరిమిత కాలం ఉండే ఆఫర్ మాత్రమేనని, పెట్టుబడిదారులు త్వరపడి, తమ పెట్టుబడిని అధిక రాబడినిచ్చే ఈ పథకం వైపు మళ్లించాలని బ్యాంకు  సూచించింది.

Diwali Special FD: ఎఫ్‌డీ చేస్తే ఈ బ్యాంకులోనే చేయాలి.. అత్యధిక వడ్డీ.. సూపర్ ప్రయోజనాలు
Fixed Deposit
Follow us
Madhu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 13, 2023 | 10:30 PM

పండుగ సీజన్ ను క్యాష్ చేసుకోడానికి అన్ని రంగాల్లోని సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ప్రకటిస్తుంటాయి. ఇదే క్రమంలో బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా ప్రత్యేక వడ్డీరేట్లను అందిస్తుంటాయి. ముఖ్యంగా ఫిక్స్ డ్ డిపాజిట్ల వంటి ప్రత్యేకమైన పథకాలలో ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఎం బ్యాంకు కూడా ప్రత్యేకమైన దివాళి ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇది భారతీయ పౌరులతో పాటు నాన్ రెసిడింట్ ఇండియన్స్ కూడా అందిస్తోంది. అయితే ఇది కేవలం పరిమిత కాలం ఉండే ఆఫర్ మాత్రమేనని, పెట్టుబడిదారులు త్వరపడి, తమ పెట్టుబడిని అధిక రాబడినిచ్చే ఈ పథకం వైపు మళ్లించాలని బ్యాంకు  సూచించింది. ఈ స్పెషల్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నవంబర్ 3 నుంచి నవంబర్ 17, 2023 వరకు అమలు అయ్యే ఈ ఆఫర్ సమయంలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై 8.25% వార్షిక వడ్డీ రేట్లు వస్తాయి. రూ. 2 కోట్ల లోపు కాలబుల్, నాన్ కాలబుల్ ఎఫ్ డీలపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. సురక్షితమైన, కచ్చితమైన అధిక రాబడిని ఆశించే వారికి ఇది సరైన ఎంపిక అవుతుందని ఆ బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. వ్యక్తులు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు వ్యవధిలో 8.25% వార్షిక వడ్డీ రేటును పొందవచ్చని తెలిపింది. 391 రోజుల నుంచి 15 నెలల కాలానికి 8.10% వార్షిక వడ్డీ రేటు ఇస్తుంది.

సీనియర్ సిటిజెన్స్ కు అదనంగా ..

ఎస్పీఎం బ్యాంక్ ఇండియా సీనియర్ సిటిజెన్స్ కు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. దీపావళి ప్రత్యేక ఎఫ్ డీ పై 0.5% అదనపు వడ్డీని అందిస్తోంది. వ్యక్తులు పండుగ ప్రణాళిక కింద ఎస్బీఎం బ్యాంక్ ఇండియాలో వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పైన పేర్కొన్న పండుగ రేట్ల ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎస్బీఎం బ్యాంకు గురించి..

హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ(డబ్ల్యూఓఎస్) పద్ధతి ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక బ్యాంకుగా, ఎస్బీఎం బ్యాంక్ (ఇండియా) లిమిటెడ్ అధికారికంగా 2018 నుంచి డిసెంబర్ 1వ తేదీ నుంచి తన సర్వీసులు ప్రారంభించింది. ఇది పన్నెండు శాఖలను కలిగి ఉంది, ఇవి దేశవ్యాప్తంగా ముంబై, న్యూఢిల్లీ, చండీగఢ్, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ కోల్‌కతాలో ఉన్నాయి. బ్యాంక్ తన మూడు వ్యాపార విభాగాల ద్వారా భారతదేశం అంతటా తన ఖాతాదారులకు సేవలు అందిస్తోంది: అవి ఏంటంటే కార్పొరేట్, రిటైల్, ట్రెజరీ. కస్టమర్లలో పెద్ద సంస్థలు, సంస్థలు, ఎంఎస్ఎంఈలు, రిటైల్ కస్టమర్‌లు, ఎన్ఆర్ఐ దీనిలో ఖాతాలు కలిగి ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..