Mutual Funds: ఐదేళ్లలో మీ పెట్టుబడి డబుల్.. బెస్ట్ ఫండ్స్ ఇవి.. ట్రై చేసి చూడండి..

ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీనిలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇది మేం చెబుతున్న విషయం కాదు. గత కొన్నేళ్ల పెట్టుబడుల డేటా చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2020 నుంచి మ్యూచువల్ ఫండ్‌లోకి రిటైల్ ఇన్‌ఫ్లో నెలవారీగా స్థిరంగా పెరుగుతోంది. 2024 ఆగస్టులో కూడా ట్రెండ్ కొనసాగింది. వీటిల్లో రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో అధిక రాబడినిస్తుందన్న విశ్వాసంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

Mutual Funds: ఐదేళ్లలో మీ పెట్టుబడి డబుల్.. బెస్ట్ ఫండ్స్ ఇవి.. ట్రై చేసి చూడండి..
Mutual Fund
Follow us

|

Updated on: Sep 30, 2024 | 7:23 PM

ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీనిలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇది మేం చెబుతున్న విషయం కాదు. గత కొన్నేళ్ల పెట్టుబడుల డేటా చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2020 నుంచి మ్యూచువల్ ఫండ్‌లోకి రిటైల్ ఇన్‌ఫ్లో నెలవారీగా స్థిరంగా పెరుగుతోంది. 2024 ఆగస్టులో కూడా ట్రెండ్ కొనసాగింది. వీటిల్లో రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో అధిక రాబడినిస్తుందన్న విశ్వాసంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

రికార్డు స్థాయి పెట్టుబడులు..

ఏఎంఎఫ్ఐ డేటా ప్రకారం 2024 ఆగస్టులో, ఈక్విటీ పథకాలలోకి నికర ఇన్‌ఫ్లో రూ. 38,239 కోట్లకు చేరుకుంది. 2024 జూలైలో రూ. 37,113 కోట్ల నుంచి 3.3 శాతం పెరిగింది. ఎస్ఐపీల ఇన్‌ఫ్లో రికార్డు స్థాయిలో రూ. 2350 కోట్లను తాకింది. ఇది వరుసగా 14వ నెల జీవితకాల గరిష్టాలను సూచిస్తోంది.

పెట్టుబడులు పెరగడానికి కారణం ఇదే..

మ్యూచువల్ ఫండ్ పథకాలు, ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులు  అసాధారణంగా ఉన్నాయి. అంతర్జాతీయ ఈక్విటీ పథకాలను మినహాయించి, గత ఐదేళ్లలో అన్ని ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీల నుంచి సగటు రాబడి 15% సీఏజీఆర్ కంటే ఎక్కువగా ఉంది. వ్యక్తులు తమ పెట్టుబడులను 5 సంవత్సరాలలో రెట్టింపు చేయడానికి అవసరమైన రాబడి ఇది. 14.87% లేదా అంతకంటే ఎక్కువ సీఏజీఆర్ వద్ద వృద్ధి చెందితే ఏదైనా పెట్టుబడి 5 సంవత్సరాలలో రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతన్నారు.

బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్..

మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం.. ఇవి రాబోయే 5 సంవత్సరాలలో మీ పెట్టుబడులను రెట్టింపు చేయడానికి మంచి అవకాశం కలిగి ఉన్నాయి.

మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లు.. గత 5 సంవత్సరాలలో ఈ కేటగిరీ సగటు రాబడి 25% కంటే ఎక్కువ సీఏజీఆర్ తో ఈ వర్గం అత్యంత ఆశాజనకంగా ఉంది.

ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లు.. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లు మార్కెట్ క్యాప్‌లలో, ఏ నిష్పత్తిలోనైనా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ వర్గం గత ఐదేళ్లలో సుమారు 21% సీఏజీఆర్ ని అందించింది .

మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌లు.. ఇవి హైబ్రిడ్ ఫండ్‌లు. ఇవి కనీసం 3 విభిన్న అసెట్ క్లాస్‌లలో కనీసం 10% పెట్టుబడి పెడతాయి. ఇవి ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్ కంటే తక్కువ రిస్క్ కలిగి ఉన్నాయి. ఈ ఫండ్‌లు గత 5 సంవత్సరాలలో సగటున 19.2% సీఏజీఆర్ ని అందించాయి.

కాంట్రా ఫండ్‌లు.. ఈ ఫండ్‌లు ఇప్పటికే ఉన్న మార్కెట్ ట్రెండ్‌లకు వ్యతిరేకంగా పెట్టుబడి పెడతాయి. గత ఐదేళ్లలో సగటున 27% వార్షిక రాబడిని అందించాయి.

ఎంఎన్సీ ఫండ్‌లు.. ఎంఎన్సీ కంపెనీలు మంచి కార్పొరేట్ గవర్నెన్స్‌ని కలిగి ఉంటాయి. ఈ ఫండ్స్ గత ఐదేళ్లలో 19% వార్షిక రాబడిని ఇచ్చాయి.

నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్.. ప్రస్తుతం, లార్జ్ క్యాప్ స్పేస్ సాపేక్షంగా చాలా విలువైనది. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా సాంప్రదాయిక పెట్టుబడిదారుడు ఐదేళ్లలో తమ డబ్బును రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది . ఈ ఫండ్‌లు గత ఐదేళ్లలో 18% వార్షిక రాబడిని అందించాయి.

సెక్టోరల్ ఫండ్స్.. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ ఫండ్స్‌లో ఎక్కువ భాగం ఉంటాయి. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఈ రంగం మెరుగైన పనితీరును కనబరుస్తుందని అంచనా వేయవచ్చు.

టెక్నాలజీ మ్యూచువల్ ఫండ్‌లు.. ఈ ఫండ్‌లు ఇటీవలి కాలంలో తక్కువ పనితీరును కనబరిచాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గించడం ఈ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

లార్జ్ క్యాప్ ఫండ్‌లు.. స్థిరమైన ఇన్‌ఫ్లోలు ప్రధానంగా లార్జ్ క్యాప్స్‌లోకి వస్తాయి, ఈ కేటగిరీలో బాగా మేనేజ్ చేయబడిన ఫండ్స్ వచ్చే 5 సంవత్సరాలలో 19% కంటే ఎక్కువ సగటు రాబడిని అందించే అవకాశం ఉంది.

ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లు.. గత 5 సంవత్సరాల్లో కేటగిరీ సగటు 22%గా ఉంది. మెరుగైన పనితీరు గల ఫండ్‌లు 28% కంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
పడవ బోల్తా.. 100మందికిపైగా గల్లంతు! వేడుకకు వెళ్లి వెస్తుండగా..
పడవ బోల్తా.. 100మందికిపైగా గల్లంతు! వేడుకకు వెళ్లి వెస్తుండగా..