Best Bike Covers: మీ బైక్ ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే.. ఈ కవర్లు వాడాల్సిందే..

మీరు కనుక క్లాసిక్ రాయల్ ఎన్ ఫీల్డ్ 350 బైక్ ను కలిగి ఉంటే ఈ బైక్ కవర్ తప్పనిసరిగా కొనుగోలు చేయండి. ఇది ఆ బైక్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇది దుమ్మూ, ధూళి, నీరు నుంచి బండికి రక్షణ ఇస్తుంది. తేమ నుంచి కాపాడుతుంది. ఇంజిన్ లోపలి భాగాలకు డస్ట్ పట్టకుండా చూస్తుంది.

Best Bike Covers: మీ బైక్ ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే.. ఈ కవర్లు వాడాల్సిందే..
Bike Covers
Follow us

|

Updated on: Aug 06, 2024 | 6:47 PM

ప్రస్తుత సమాజంలో ద్విచక్ర వాహనం లేని కుటుంబాలు లేవనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ స్కూటరో, బైకో ఏదో ఒకటి కలిగి ఉంటున్నారు. అయితే వాటిని పార్క్ చేయడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇళ్లలో పార్కింగ్ స్థలాలు ఉండవు. చాలా చోట్ల బండ్లను రోడ్డుపైనే ఉంచేస్తారు. అలాంటి సమయంలో బండ్లు దుమ్మూ, ధూళి, వర్షం, మంచు వంటి వాటి వల్ల పాడవుతాయి. వీటి నుంచి సంరక్షించుకోవాలంటే మీకు బైక్ కవర్లు బాగా ఉపకరిస్తాయి. బైక్ రంగు వెలిసిపోకుండా.. త్వరగా పాతబడిపోకుండా కాపాడతాయి. మార్కెట్లో చాలా రకాల బైక్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. విభిన్న రకాల మెటీరియల్స్ తో అవి కనిపిస్తాయి. పాలిస్టర్ నుంచి నైలాన్ వరకూ వాటర్ ప్రూఫ్ కలిగినవి ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ ఐదు బైక్ కవర్లను మీకు అందిస్తున్నాం. ఈ వర్షాకాలంలో ఇవి మీ ద్విచక్ర వాహనాలను సంరక్షించుకునేందుకు ఉపకరిస్తాయి.

అమెజాన్ బ్రాండ్- సోలిమో యూనివర్సల్ బైక్ వాటర్ రెసిస్టెంట్ కవర్..

అన్ని రకాల వాతావరణ పరిస్థితుల నుంచి మీ బైక్ ను సంరక్షించే కవర్ కోసం చూస్తున్నట్లు అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. అమెజాన్ సొంత బ్రాండ్ అయిన సోలిమో నుంచి పూర్తి వాటర్ రెసిస్టెంట్ కవర్ ఇది. డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిలో ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే యూవీ ప్రొటెక్షన్. ఈ కవర్ బయటి ఎండ వాతావరణంలో వేడి నుంచి బండిని సంరక్షిస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 299గా ఉంది.

ఆటోఫై 100శాతం వాటర్ ప్రూఫ్ బైక్ కవర్..

ప్రతి ద్విచక్ర వాహనానికి ఉండాల్సిన కవర్ ఇది. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్. ఎంత వర్షంలో అయినా ఇది సంరక్షణ ఇస్తుంది. అలాగే యూవీ కిరణాలను నుంచి కూడా కాపాడుతుంది. 180సీసీ బైక్ లవరకూ ఇది ఉపయుక్తంగా ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 498గా ఉంది.

రైడర్ షైన్ డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ బైక్ కవర్..

మీరు కనుక క్లాసిక్ రాయల్ ఎన్ ఫీల్డ్ 350 బైక్ ను కలిగి ఉంటే ఈ బైక్ కవర్ తప్పనిసరిగా కొనుగోలు చేయండి. ఇది ఆ బైక్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇది దుమ్మూ, ధూళి, నీరు నుంచి బండికి రక్షణ ఇస్తుంది. తేమ నుంచి కాపాడుతుంది. ఇంజిన్ లోపలి భాగాలకు డస్ట్ పట్టకుండా చూస్తుంది. 5 తాళ్లతో కూడా ఇంటర్ లాకింగ్ ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 499గా ఉంది.

రైడా రెయిన్ ప్రో బైక్ కవర్..

ఈ నావీ బ్లూ కలర్లో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లోని బెస్ట్ రాయిల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 బైక్ కవర్స్ ఇవి. ఇవి మీ బండిని వర్షం నుంచి దుమ్మూ, ధూళి నుంచే కాకుండా యూవీ కిరణాలను కూడా సంరక్షిస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 499గా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 1990643 బైక్ కవర్..

ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ 90643 బైక్ కవర్ మీ బండిని వర్షం, దుమ్మూ, ధూళి, యూవీ కిరణాల నుంచి సంరక్షిస్తుంది. బైక్ యాక్సెసరీస్ అన్నింటికీ రక్షణ నిస్తుంది. ఇది యూకేలో డిజైన్ చేసిన కవర్. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చూడటానికి కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 1,078గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..