IT Refund Fraud: ఐటీ రీఫండ్ పేరుతో వెలుగులోకి నయా స్కామ్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ
భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను కట్టడం తప్పనిసరి. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చివరి తేదీ జూలై 31, 2024తో ముగిసింది. అయితే పన్ను చెల్లింపుదారులు కొంత మంది ఇప్పటికీ ఐటీ రీఫండ్‌ల కోసం వేచి చూస్తున్నారు. ఇదే అవకాశంగా మలుచుకున్న కొందరు కేటుగాళ్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారిని టార్గెట్ చేస్తూ కొత్త మోసానికి తెరలేపారు.
భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను కట్టడం తప్పనిసరి. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చివరి తేదీ జూలై 31, 2024తో ముగిసింది. అయితే పన్ను చెల్లింపుదారులు కొంత మంది ఇప్పటికీ ఐటీ రీఫండ్‌ల కోసం వేచి చూస్తున్నారు. ఇదే అవకాశంగా మలుచుకున్న కొందరు కేటుగాళ్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారిని టార్గెట్ చేస్తూ కొత్త మోసానికి తెరలేపారు. ముఖ్యంగా వాపసు పొందాలంటే వారు పంపిన లింక్స్‌పై క్లిక్ చేయాలంటూ మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. భారత ప్రభుత్వానికి సంబంధించిన సైబర్ వింగ్ అయిన సైబర్ దోస్త్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ స్కామ్ గురించి ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు తన ఎక్స్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి మెసేజ్‌లు వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
ప్రజలను దోచుకోవడానికి మోసగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలను అవలంబిస్తూనే ఉంటారని, దీని వల్ల సామాన్య ప్రజానీకమే నష్టపోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందేశాలను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదాయపు పన్ను రీఫండ్ మోసాన్ని నివారించడానికి ఆఫర్‌లను కలిగి ఉన్న సందేశాలకు రిప్లయ్ ఇవ్వద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా మోసపూరిత లింక్స్‌పై క్లిక్ చేయవద్దని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను రీఫండ్ అంటూ వచ్చే ఈ-మెయిల్‌లు, లింక్‌లపై క్లిక్ చేయవద్దని కోరుతున్నారు. ఆయా లింక్స్ క్లిక్ చేస్తే అవి మిమ్మల్ని నకిలీ వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లకు రీడైరెక్ట్ అయ్యి మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్ము తస్కరించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా వినియోగదారులు మోసానికి గురైన తర్వాత, మీ ఫిర్యాదును వెంటనే సైబర్ సెల్ పోర్టల్ cybercrime.gov.in లో లేదా 1930 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఆర్థిక సంవత్సరం 2024లో ఐటీఆర్ దాఖలు ఇలా
2024-25 ఆర్థిక సంవత్సరంలో జూలై 31 వరకు దాదాపు 7.28 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు చేశారు. పీఐబీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం దాదాపు 5.27 కోట్ల మంది కొత్త పన్ను విధానంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. అయితే 2.01 కోట్లు పాత పన్ను విధానంలో నమోదు చేశారు. దాదాపు 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. అయితే 28 శాతం మంది పాత పన్ను విధానంలోనే ఉన్నారు. జూలై 31న ఒకే రోజు 69.92 లక్షల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయని ఐటీఆర్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..