AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS: విశ్రాంత జీవితం సంతోషంగా గడవాలా..? ఈ రిటైర్మెంట్ పథకం చాలా బెస్ట్..!

మనిషి తన జీవితంలో కొన్ని అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా తిండి, బట్ట, గూడుకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఇవి కనీస అవసరాలని మన పెద్దలు చెబుతారు. వీటితో పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విశ్రాంత జీవితాన్ని గడపడానికి ప్రణాళిక వేసుకోవాలి. ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా జీవించటానికి కొంత డబ్బును పోగుచేసుకోవాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడే పదవీ విరమణ పథకాల్లో డబ్బులను దాచుకోవడం వల్ల ప్రయోజకం కలుగుతుంది. ఇలాంటి పథకాల్లో జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) ఒకటి. ప్రభుత్వ మద్దతుతో కూడిన ఈ పథకం వల్ల విశ్రాంత జీవితానికి భరోసా లభిస్తుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

NPS: విశ్రాంత జీవితం సంతోషంగా గడవాలా..? ఈ రిటైర్మెంట్ పథకం చాలా బెస్ట్..!
senor citizen
Nikhil
|

Updated on: May 21, 2025 | 5:28 PM

Share

జాతీయ పెన్షన్ స్కీమ్ కు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న దేశ పౌరులు, ప్రవాస భారతీయులు అర్హులు. ఈ పథకం వల్ల వృద్ధాప్యం లో ఆర్థిక భరోసా లభించడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిలో పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలో వివిధ సెక్షన్ల కింద మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగ విరమణ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది. మీ ఖాతాను ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. కాలక్రమీణా మెరుగైన రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్ స్కీమ్ లో రెండు రకాల ఖాతాలు ఉంటాయి. వాటిని టైర్ 1, టైర్ 2 ఖాతాలు అని పిలుస్తారు.

  • ఎన్పీఎస్ ఖాతాను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో తీసుకోవచ్చు. ఆన్ లైన్ కు సంబంధించి ఈ-ఎన్పీఎస్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • మీ ఆధార్, పాన్ లేదా ఆఫ్ లైన్ ఆధార్ ఎక్స్ ఎంఎల్ ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వ్యక్తిగత వివరాలు దానిలో నమోదు చేయాలి.
  • ఎస్బీఐ , ఎల్ఐసీ, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ తదితర అందుబాటులో ఉన్న ఫండ్ మేనేజర్లను ఎంచుకోవాలి.
  • టైర్ – ఖాతాకు రూ.500, టైర్ – 2 ఖాతాకు రూ.1000 చొప్పున కనీస మొత్తం చెల్లించాలి. మీ రిజస్ట్రేషన్ విజయవంతమైతే ప్రాన్ (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య)ను అందుకుంటారు. ఇదే మీకు ఎన్పీఎస్ ఖాతా అవుతుంది.
  • ఆధార్ ఆధారిత ఓటీపీని ఉపయోగించి లేదా సంతకం చేసిన రిజిస్ట్రేషన్ ఫారమ్ స్కాన్ చేసిన కాపీని అప్ లోడ్ చేయాలి.
  • ఆఫ్ లైన్ లో ఖాతాలను తీసుకునేవారు మీ సమీపంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసులను సంప్రదించాలి.
  • అక్కడి ఉద్యోగులు అందించిన ఎన్పీఎస్ ఫారంలో మీ వ్యక్తిగత వివరాలు, నామినీ పేరు రాసి, మీ ఫెన్షన్ ఫండ్ మేనేజర్ ను ఎంపిక చేసుకోవాలి.
  • గుర్తింపు, చిరునామా రుజువు కోసం పత్రాలు, పాస్ పోర్టు ఫోటోను అందజేయాలి. కనీస మొత్తం చెల్లించిన తర్వాత మీకు ప్రాన్ కార్డు, స్వాగత కిట్ ను అందుకుంటారు.

ఈ పథకంలో చేరిన వారు విరమణ తర్వాత వారి ఖాతాలో 60 శాతం మొత్తాన్ని ఓకేసారి ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. ఉద్యోగ విరమణకు ముందు అయితే 20 శాతం మాత్రమే ఉపసంహరించుకోవాలి. మిగిలిన 80 శాతాన్ని యాన్యుటీకి ఉపయోగించాలి. విద్య, వైద్యం, అత్యవసరాల కోసం ఖాతా తెరిచిన మూడేళ్ల తర్వాత 25 శాతం వరకూ విత్ డ్రా చేసుకునే వీలుంటుంది.