AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: వావ్ అనేలా వడ్డీ రేట్ల పెంపు.. ఎఫ్‌డీ చేసే వారికి ఇదే సరైన సమయం..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాయి. వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులతో పాటు పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ బ్యాంకులు కూడా ఉన్నాయి.

FD Interest Rates: వావ్ అనేలా వడ్డీ రేట్ల పెంపు.. ఎఫ్‌డీ చేసే వారికి ఇదే సరైన సమయం..
Fixed Deposit
Madhu
|

Updated on: Feb 25, 2024 | 7:53 AM

Share

ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. దేశంలోని కొన్ని ప్రముఖ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాయి. వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులతో పాటు పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ ఎప్పుడు చేసినా.. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లను తెలుసుకొని.. వాటిని బేరీజు వేసుకోని ఎక్కడ మనకు అధిక ప్రయోజనాలు వస్తాయో అంచనాకు రావాలి. ఆ తర్వాతే పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో కొత్త ఎఫ్ డీ వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐసీఐసీఐ బ్యాంక్‌లో వడ్డీ రేటు..

ప్రముఖ ప్రైవేటు రంగ రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను ఫిబ్రవరి 22 నుంచి అమలు చేస్తోంది. ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు 3 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు అందిస్తోంది. వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల లోపు ఒక్క డిపాజిట్‌పై మాత్రమే ఉంటాయని బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది. రూ. 2కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ కు అయితే వడ్డీ రేట్లు మరోలా ఉన్నాయి. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ కేటగిరీలో, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే ఎఫ్డీలకు వడ్డీ రేట్లు 4.75 శాతం నుంచి 7.40 శాతం వరకు ఉంటాయి. అటువంటి డిపాజిట్లకు, సీనియర్ సిటిజన్లకు కూడా ఇదే వడ్డీ రేటును అందిస్తోంది.

ఇవి కూడా చదవండి
  • ఎస్బీఎం బ్యాంక్ ఇండియా ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ రేటు 8.25 శాతం అందిస్తోంది.
  • ఆర్బీఎల్ బ్యాంక్ ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ రేటు 8.10 శాతాన్ని అందిస్తోంది.
  • డీసీబీ తన ఎఫ్‌డీపై గరిష్టంగా 8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఎఫ్‌డీకి అత్యధిక రేటు 7.25 శాతం, యాక్సిస్ బ్యాంక్‌కి 7.20 శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికొస్తే, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అత్యధిక ఎఫ్డీ వడ్డీ రేటు 7.40 శాతంతో అగ్రస్థానంలో ఉంది.
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.30 శాతం వడ్డీ రేటుతో రెండో స్థానంలో ఉంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా కొన్ని బ్యాంకులు గరిష్టంగా 7.25 శాతం వడ్డీ రేటును అందజేస్తున్నాయి.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎఫ్‌డీపై గరిష్టంగా 7.10 శాతం వడ్డీ రేటును అందజేస్తుండగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 7 శాతం ఎఫ్‌డీ వడ్డీ రేటును కలిగి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..