AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: ఆ రైతులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్‌ డబ్బులు నిలిపివేత.. కారణం ఏంటంటే..

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు రకరకాల పథకాలను అమలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు ఆర్థికంగా నిలదొక్కుకునే పథకాలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని రైతులకు ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి రాగా, మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ఒకటి. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది రూ.6000 అందుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు 15వ విడత అందుకోగా..

PM Kisan: ఆ రైతులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్‌ డబ్బులు నిలిపివేత.. కారణం ఏంటంటే..
Pm Kisan
Subhash Goud
|

Updated on: Feb 25, 2024 | 7:23 AM

Share

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు రకరకాల పథకాలను అమలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు ఆర్థికంగా నిలదొక్కుకునే పథకాలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని రైతులకు ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి రాగా, మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ఒకటి. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది రూ.6000 అందుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు 15వ విడత అందుకోగా, ఇప్పుడు 16వ విడత రానుంది. అయితే ఈ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయోనన్న తేదీని ఖరారు చేసింది కేంద్రం. ఈనెల 28వ తేదీని ప్రధాని నరేంద్ర మోడీ ఈ పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్నారు.

ఈ రైతులకు స్కీమ్‌ డబ్బులు నిలిపివేత

ఈ పథకం కింద లబ్ది పొందుతున్న రైతుల్లో కొందరికి ఎదురు దెబ్బ తగలనుంది. కొందరి రైతులకు ఈ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. eKYC చేసుకోని రైతులకు 16వ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి. ఈ పీఎం కిసాన్‌ కింద లబ్ది పొందుతున్న ప్రతి ఒక్క రైతు కేవైసీ వివరాలు అందించాలని కేంద్రం ఎప్పటి నుంచో పదేపదే చెబుతూ వస్తోంది. అయినా ఇప్పటికి కొందరు రైతులు కేవైసీ చేసుకోలేదని తెలుస్తోంది. అలాంటి రైతులకు ఈ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి.

ఇవి కూడా చదవండి

పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం, పీఎం కిసాన్ నమోదు చేసుకున్న రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC PMKisan పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని మీ సేవా కేంద్రాలు, లేదా ఇతర ఆన్‌లైన్‌ సెంటర్లను సందర్శించాలి. ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలు ఎటువంటి మధ్యవర్తి లేకుండా నేరుగా వారి ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు చేరుకోవడానికి EKYC అవసరం. అయితే గత 15వ విడలో కేవైసీ చేసుకోని రైతులకు డబ్బులను నిలిపివేసింది కేంద్రం.

PM కిసాన్ 16వ విడత స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

పథకం అధికారిక వెబ్‌సైట్ pmkisan.Gov.Inని సందర్శించండి. మీ స్క్రీన్‌పై చూపబడిన స్టేటస్ లింక్‌పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు స్క్రీన్‌పై ఉన్న రెండు ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవాలి. మీరు మీ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ IDని ఎంటర్‌ చేసి తనిఖీ చేసుకోవచ్చు.

అనర్హులపై కన్నేసిన కేంద్రం

ఈ పీఎం కిసాన్‌ పథకం ద్వారా అర్హులే కాకుండా అనర్హులు కూడా లబ్ది పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వారిని ఏరివేత పనిలో ఉంది. ఇప్పటికే చాలా మంది అనర్హులుగా ఉండి ఈ పథకం కింద లబ్దిపొందుతున్న రైతుల పేర్లను తొలగించింది. వారికి పీఎం కిసాన్‌ డబ్బులను నిలిపివేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అనర్హులుగా ఉన్న రైతులను గుర్తిస్తోంది. ఒక వేళ మీరు అనర్హులుగా తేలినట్లయితే ఇప్పటి వరకు పొందిన డబ్బులను తిరిగి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

పీఎం కిసాన్ స్కీమ్ అర్హతలు ఏమిటి?

– భారతీయ పౌరులు అయ్యి ఉండాలి.

– చిన్న, సన్న కారు రైతులు ఎవరైనాసరే ఈ పథకంలో చేరవచ్చు.

– వ్యవసాయ పొలం కలిగిన వారికి కూడా పథకం వర్తిస్తుంది.

– గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతులు అందరూ పథకంలో చేరేందుకు అర్హులు.

– భార్య, భర్తపై భూమి ఉన్నట్లయితే అందులో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

వీరికి ఈ పథకం వర్తించదు:

పీఎం కిసాన్ స్కీమ్ కొంత మందికి వర్తించదని గమనించాలి. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్ వంటి వారికి పొలం ఉన్నా డబ్బులు రావు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా భూమి ఉన్నా పీఎం కిసాన్ వర్తించదు. నెలకు రూ.10 వేలు లేదా ఆపైన పెన్షన్ తీసుకునే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అందుబాటులో లేదు. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవిలో ఉన్నా లేదంటే మాజీ రాజకీయ నాయకులకు స్కీమ్ వర్తించదు. అలాగే ఆధార్ కార్డులో తప్పులు ఉన్నా లేదంటే బ్యాంక్ ఖాతాలో తప్పులు ఉన్నా పీఎం కిసాన్ డబ్బులు రావని గుర్తుపెట్టుకోవాలి. వీరికి అర్హత ఉన్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు. అందువల్ల తప్పులు లేకుండా చూసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి