AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Maintenance Tips: ఈ టిప్స్ పాటిస్తే.. మీ కారు పాతదైనా.. కొత్తగా పరుగులు పెడుతుంది..

కారును కొనుగోలు చేసినంత మాత్రాన మన బాధ్యత తీరిపోదు. దానికి నిర్వహణను సక్రమంగా చేసినప్పుడే ప్రయోజనం కలుగుతుంది. కొత్త కార్లతో పోల్చితే పాత కార్లను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పాత కారు కూాడా కొత్త దానిలా పరుగులు తీస్తుంది. అవేంటో తెలుసుకుందాం..

Car Maintenance Tips: ఈ టిప్స్ పాటిస్తే.. మీ కారు పాతదైనా.. కొత్తగా పరుగులు పెడుతుంది..
Cars
Madhu
|

Updated on: May 09, 2024 | 3:18 PM

Share

ఆధునిక జీవన శైలిలో ప్రతి కుటుంబానికి కారు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. సురక్షిత ప్రయాణం, సమయానికి రాకపోకలు సాగించడానికి, అత్యవసర సమయాలతో ప్రయాణానికి కారు చాలా అవసరం. ముఖ్యంగా నగరాలు విస్తరించడం వల్ల శివారు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ అపార్ట్‌మెంట్లు ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో నివసించేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అలాంటి వారందరికీ కారు వినియోగం పెరిగింది.

సామాన్యులకు అందుబాటులో..

సాధారణంగా కార్లు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండవు. వాటి ధరలు రూ.లక్షలలో ఉండటం వల్ల కేవలం ఉన్నత మార్గాల ప్రజలు మాత్రమే వాడతారు. అయితే మధ్యతరగతి ప్రజలకు కూడా కారు కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. అలాంటి వారి కోసమే సెకండ్ హ్యాండ్ కార్లు (వినియోగించిన కార్లు) అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిని విక్రయించే షాపులు, సంస్థలు కూడా ప్రతిచోటా అందుబాటులోకి వచ్చాయి. అక్కడకు వెళ్లి మన బడ్జెట్ ప్రకారం నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. లేదా మనకు తెలిసిన వారి నుంచి కారును కొనుగోలు చేయవచ్చు.

విస్తరిస్తున్నమార్కెట్..

దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్‌ సమయం నుంచి ప్రజలు సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం, ఉత్పత్తి వ్యయం పెరగడంతో కొత్త కార్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పాత కార్లు వీలున్న ధరకు అందుబాటులోకి వచ్చాయి.

ఈ చిట్కాలు పాటించండి..

కారును కొనుగోలు చేసినంత మాత్రాన మన బాధ్యత తీరిపోదు. దానికి నిర్వహణను సక్రమంగా చేసినప్పుడే ప్రయోజనం కలుగుతుంది. కొత్త కార్లతో పోల్చితే పాత కార్లను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పాత కారు కూాడా కొత్త దానిలా పరుగులు తీస్తుంది.

ఫ్ల్యూయిడ్స్ ని తనిఖీ చేయడం.. కొన్ని విషయాలను పాటించడం వల్ల పాత కార్లను కొత్త వాటితో సమానంగా పనిచేసేలా చూసుకోవచ్చు. దానిలో ఫ్ల్యూయిడ్స్ ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యమైంది. ఇంజిన్‌ ఆయిల్‌, బ్రేక్‌ ఆయిల్‌, టాన్స్‌మిషన్‌ ఆయిల్‌, కూలెంట్‌లు సరిగ్గా ఉన్నాయో పరిశీలించుకోవాలి. ప్రధానంగా ఇంజిన్‌ ఆయిల్‌ను తాజాగా ఉండేలా చూసుకోవాలి.

టైర్లు.. సాధారణంగా టైర్ల విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. కానీ కారు నిర్వహణలో టైర్లు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వాటిలోని గాలిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అవి తిరిగిన దూరాన్ని బట్టి, నిబంధనల ప్రకారం మార్చివేయాలి. లేకపోతే టైర్ల కు పగుళ్లు ఏర్పడి, ప్రయాణ సమయంలో పంక్చర్లు పడవచ్చు. దానివల్ల ప్రయాణం ఆలస్యం కావడంతో పాటు ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది.

దీర్ఘకాలంలో ఇబ్బంది లేకుండా.. కారులోని కొన్ని భాగాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. లేకపోతే దీర్ఘకాలంలో ఇబ్బందులు కలిగిస్తాయి. విండ్‌ షీల్డ్‌, వాహనం పెయింట్‌, వైపర్‌బ్లే​డ్లు మొదలైన వాటిని సరిచూసుకోవాలి. వీటిపై నిత్యం సూర్యకిరణాలు, వర్షం, గాలి, ధూలి వంటి పడుతుంటాయి. వాటి కారణంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..