ATM Withdrawal Charges: ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ఇది చదవండి..

ఎక్కడ ఏ సమయంలో అయినా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొనే వెసులుబాటు ఉండటంతో అది వినియోగదారులకు బాగా ఉపకరిస్తోంది. అయితే వినియోగదారులు ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసేందుకు బ్యాంకులు సర్వీస్ చార్జి వసూలు చేస్తాయి. ఉచిత లావాదేవీలకు పరిమితి ఉంది. అది దాటిపోతే మీరు ఏటీఎం ద్వారా చేసే ప్రతి లావాదేవీకి సర్వీస్ చార్జి పడుతుంది.

ATM Withdrawal Charges: ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ఇది చదవండి..
Atm
Follow us

|

Updated on: May 09, 2024 | 3:37 PM

బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డు ఉంటుంది. ఇటీవల ఇంటర్ నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పటికీ నగదు రూపంలో కావాలనుకునేవారు ఏటీఎంలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఎందకంటే ప్రతిసారి బ్యాంకులకు వెళ్లి డబ్బు తీసుకోవడం అంటే కష్టతరమైనది. అందుకే బయట ఎక్కడ ఏ సమయంలో అయినా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొనే వెసులుబాటు ఉండటంతో అది వినియోగదారులకు బాగా ఉపకరిస్తోంది. అయితే వినియోగదారులు ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసేందుకు బ్యాంకులు సర్వీస్ చార్జి వసూలు చేస్తాయి. ఉచిత లావాదేవీలకు పరిమితి ఉంది. అది దాటిపోతే మీరు ఏటీఎం ద్వారా చేసే ప్రతి లావాదేవీకి సర్వీస్ చార్జి పడుతుంది. ఆ చార్జీలు ఏ బ్యాంకులో ఎలా ఉంటాయి? అసలు ఎందుకు ఆ చార్జి వసూలు చేస్తారు? తెలుసుకుందాం రండి..

ఎంత వసూలు చేస్తారు?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నెలవారీ ఏటీఎం కార్డ్ రుసుముతో పాటు ఖాతాదారుల నుంచి ప్రతి లావాదేవీకి రూ.21 వసూలు చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అయితే ఇక్కడ మనించదగ్గ విషయం ఏమిటంటే, మీ బ్యాంక్ ఏటీఎం నుండి మొదటి ఐదు లావాదేవీలు కస్టమర్లకు పూర్తిగా ఉచితం. మెట్రో నగరాల్లో అయితే ఇతర బ్యాంకుల ఏటీఎంలకు మూడు లావాదేవీల పరిమితిని నిర్ణయించారు. నాన్-మెట్రో నగరాల్లో ఈ పరిమితి ఐదు విత్ డ్రాల్స్ వరకూ అవకాశం ఉంటుంది. దీని కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే మీరు ఒక్కో ఉపసంహరణకు గరిష్టంగా రూ. 21 వరకూ రుసుము చెల్లించాలి. ఈ నిబంధన 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది.

ఎస్బీఐ ఏటీఎం చార్జీలు ఇలా..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ బ్యాలెన్స్ రూ. 25,000 వరకు 5 ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తుంది. దీని కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే, మీరు ప్రతి లావాదేవీకి రూ. 10 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. అదే ఎస్బీఐ కార్డుతో ఇతర బ్యాంకుల ఏటీఎంలలో విత్ డ్రా చేస్తే రూ. 20తో పాటు జీఎస్టీ చెల్లించాలి. మీ నెలవారీ బ్యాలెన్స్ రూ. 25,000 కంటే ఎక్కువ ఉంటే, మీరు ఏటీఎం నుంచి మీకు కావలసినన్ని సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు.

పీఎన్బీ ఏటీఎం చార్జీలు..

దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పీఎన్బీ, మెట్రో, నాన్-మెట్రో నగరాల్లోని తన వినియోగదారులకు 5 ఉచిత ఏటీఎం లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది. దీని తర్వాత మీరు పీఎన్బీ ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై రూ. 10తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే రూ.21తో పాటు జీఎస్టీ వసూలు చేస్తుంది.

హెచ్డీఎఫ్సీ ఏటీఎం చార్జీలు..

పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తన కస్టమర్‌లకు నెలలో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంది. మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో అయితే ఈ పరిమితి 3 లావాదేవీలు మాత్రమే ఉంటుంది. దీని తర్వాత మీరు ప్రతి లావాదేవీకి రూ. 21 ప్లస్ జీఎస్టీ రుసుము చెల్లించాలి.

ఐసీఐసీఐ ఏటీఎం చార్జీలు..

ఇతర బ్యాంకుల మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన సొంత ఏటీఎంల నుంచి 5 లావాదేవీలు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 లావాదేవీల పరిమితిని నిర్ణయించింది. దీని తర్వాత, ఖాతాదారులు ప్రతి విత్‌డ్రాకు రూ.20, ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..