AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corporate FDs: అధిక వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కావాలా? ఇదిగో మీకు బెస్ట్ ఆప్షన్..

కార్పొరేట్ ఎఫ్డీల్లో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయా కంపెనీల పరిస్థితిని అంచనా వేయడానికి మీరు పెట్టుబడి పెట్టే ముందు ఆయా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్‌లను తప్పక చూడాలి. డిపాజిటర్లు కార్పొరేట్ ఎఫ్డీలను ఎంచుకునేటప్పుడు CRISIL, ICRA, CARE వంటి రేటింగ్ ఏజెన్సీలు కేటాయించిన రేటింగ్‌లను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.

Corporate FDs: అధిక వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కావాలా? ఇదిగో మీకు బెస్ట్ ఆప్షన్..
Fixed Deposit
Madhu
|

Updated on: May 09, 2024 | 4:25 PM

Share

పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. స్థిరమైన వడ్డీ రేటుతో కచ్చితమైన రాబడిని అందిస్తాయి. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేటు ఉంటుంది. ఏ బ్యాంకులో మంచి వడ్డీ రేటు ఉందో తెలుసుకొని పెట్టుబడి పెట్టడం ఉత్తమం. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) సహా పలు కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం వృద్ధి, విభిన్న నియంత్రణ అవసరాల దృష్ట్యా ఎన్బీఎఫ్సీలు అదనపు క్రెడిట్ రిస్క్‌ను కలిగి ఉన్నాయి. దీని కారణంగా బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే ఎన్బీఎఫ్సీలు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే వీటిల్లో పెట్టుబడులు పెట్టేముందు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.

జాగ్రత్తలు అవసరం..

కార్పొరేట్ ఎఫ్డీల్లో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయా కంపెనీల పరిస్థితిని అంచనా వేయడానికి మీరు పెట్టుబడి పెట్టే ముందు ఆయా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్‌లను తప్పక చూడాలి. డిపాజిటర్లు కార్పొరేట్ ఎఫ్డీలను ఎంచుకునేటప్పుడు CRISIL, ICRA, CARE వంటి రేటింగ్ ఏజెన్సీలు కేటాయించిన రేటింగ్‌లను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఎన్‌బీఎఫ్‌సీ లేదా హెచ్‌ఎఫ్‌సీ జారీ చేసే కార్పొరేట్ ఎఫ్‌డీల ఆర్థిక ఆరోగ్యంపై ఏజెన్సీల అంచనా ఆధారంగా వారు ఈ రేటింగ్‌లను కేటాయిస్తారు. అధిక-రేటెడ్ కార్పొరేట్ ఎఫ్డీలు వడ్డీ, అసలు రీపేమెంట్లలో డిఫాల్ట్‌లకు తక్కువ అవకాశాలను కలిగి ఉంటాయి. ఉత్తమ వడ్డీ రేట్లను అందించే కొన్ని కార్పొరేట్ ఎఫ్డీల జాబితాను మీకు అందిస్తున్నాం..

ఇక్కడ అందిస్తున్న కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్ల క్రెడిట్ రేటింగ్ AAA. అంటే అత్యధిక స్థాయి భద్రతను సూచిస్తుంది. అంతేకాక తక్కువ క్రెడిట్ రిస్క్‌ను కలిగి ఉంటుంది.

  • బజాజ్ ఫైనాన్స్ 42 నెలల కాలవ్యవధితో కుమ్ములేటివ్ ఎఫ్డీలపై సంవత్సరానికి 8.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మీరు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, మెచ్యూరిటీ తేదీ నాటికి మొత్తం రూ. 1.33 లక్షలకు పెరిగింది.
  • మహీంద్రా ఫైనాన్స్ 36-60 నెలల కాలవ్యవధితో వచ్చే కుమ్ములేటివ్ ఎఫ్డీలపై 8.05 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ విధంగా, 36 నెలల కాలవ్యవధితో రూ. 1-లక్ష క్యుములేటివ్ ఎఫ్డీ మెచ్యూరిటీ తేదీలో రూ. 1.27 లక్షలు అవుతుంది.
  • సుందరం హోమ్ ఫైనాన్స్ 48-60 నెలల కాలవ్యవధిని కలిగి ఉండే కుమ్ములేటివ్ ఎఫ్డీలపై 7.90 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కాబట్టి, 48 నెలల కాలపరిమితి కలిగిన కుమ్ములేటివ్ ఎఫ్డీ మెచ్యూరిటీ తేదీ నాటికి రూ. 1.37 లక్షలకు పెరుగుతుంది.
  • ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్ వరుసగా 36-60 నెలలు, 24-36 నెలల కాలవ్యవధితో కుమ్ములేటివ్ ఎఫ్డీలపై 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. మీరు ఈ రెండు కంపెనీలతో 36 నెలల కాలవ్యవధితో రూ. 1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రారంభించినట్లయితే, మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 1.26 లక్షలు అవుతుంది.
  • ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ 39-45 నెలల కాలవ్యవధితో వచ్చే కుమ్ములేటివ్ ఎఫ్డీలపై 7.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఆ విధంగా, 39 నెలల కాలవ్యవధితో రూ.1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.1.27 లక్షలకు పెరిగి ఉండేది.
  • అయితే బ్యాంక్ ఎఫ్డీలకు డీఐసీజీసీ వారి బీమా ఉంటుంది. అది రూ. 5లక్షల వరకూ ఉంటుంది. కానీ కార్పొరేట్ ఎఫ్డీలకు ఆ అవకాశం ఉండదు. మీకు అందించిన సమాచారం ఆయా ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు సంబంధించిన వెబ్ సైట్లలో ప్రదర్శితమై ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా