Amazon sale 2023: ఏసీ కొంటే ఇప్పుడే కొనాలి.. టాప్ బ్రాండ్లపై ఏకంగా 56శాతం వరకూ ఆఫర్లు.. పూర్తి వివరాలు ఇవి..
మంచి స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కావాలంటే కాస్త ఎక్కువ ధర వెచ్చించాల్సిందే. అయితే అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా స్ల్పిట్ ఏసీలపై అదిరిపోయే ఆఫర్లు నడుస్తున్నాయి. టాప్ బ్రాండ్లకు చెందిన ఏసీల కొనుగోలుపై దాదాపు 56శాతానికి పైగా డిస్కౌంట్ లభిస్తోంది.
ఎండ మండుతోంది. వేడి గాలులు కాక పుట్టిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. విపరీతమైన ఉక్కపపోతతో అవస్థలు తప్పడం లేదు. దీంతో అందరూ ఎయిర్ కండీషనర్ల(ఏసీ) బాట పడుతున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అందరూ ఏసీలు కొనుగోలు చేయడానికి చూస్తున్నారు. అయితే మార్కెట్లో కొన్ని వందల రకాల ఏసీలున్నాయి. మంచి 5స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కావాలంటే కాస్త ఎక్కువ ధర వెచ్చించాల్సిందే. అయితే అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా స్ల్పిట్ ఏసీలపై అదిరిపోయే ఆఫర్లు నడుస్తున్నాయి. టాప్ బ్రాండ్లకు చెందిన ఏసీల కొనుగోలుపై దాదాపు 56శాతానికి పైగా డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఆఫర్లేంటో చూసేద్దాం రండి..
ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ.. అమెజాన్ సమ్మర్ సేల్ 2023లో ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ పై 40శాతం డిస్కౌంట్ ఉంది. దీనిలో ఇన్వెర్టర్ కంప్రెషర్ ఉంటుంది. 1.5 టన్ కాబట్టి స్మాల్, మీడియం సైజ్ ఉన్న గదులకు సరిపోతుంది. ఇది కాపర్ ఓషన్ బ్లాక్ ప్రోటెక్షన్ తో వస్తుంది. ఇది తుప్పు పట్టకుండా కాపాడుతుంది. దీని ధర రూ. 45,490గా ఉంది.
లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ.. మార్కెట్లో ఉన్న బెస్ట్ 1.5 టన్ స్ల్పిట్ ఏసీల్లో ఇదీ ఒకటి. ఇది స్మాల్, మీడియం సైజ్ ఉన్న గదులకు సరిపోతోంది. దీనిపై 46శాతం డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తోంది. దీనిలో బ్లూ ఫిన్స్ ఎవాపోరేటర్ ఉంటుంది. దీని ద్వారా అధిక కూలింగ్ సాధ్యమవుతుంది. తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. దీనిలో 5 ఇన్1 కన్వెర్టబుల్ ఫీచర్ ఉంది. ఇది 52 డిగ్రీల ఉన్న టెంపరేచర్ కూడా కూల్ చేయగలుగుతుంది. దీని ధర రూ. 31,999గా ఉంది.
వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ.. ఈ ఏసీపై ఏకంగా 56శాతం డిస్కౌంట్ అమెజాన్ సేల్ లో లభిస్తోంది. దీనిలో ఇన్వెర్టర్ కంప్రెషర్ ఉంటుంది. అలాగే కాపర్ కండెన్సర్ కాయిల్ ఉంటుంది. దీని ధర రూ. 30,999గా ఉంటుంది.
ప్యానసోనిక్ 1.5 టన్ 3 స్టార్ వైఫై ఇన్వెర్టర్ స్మార్ట్ స్ల్పిట్ ఏసీ.. ఈ ప్యానసోనిక్ ఏసీపై అమెజాన్ లో 34శాతం ఆఫర్ ఉంది. దీనిలో 7 ఇన్ 1 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. ఇది రూమ్ టెంపరేచర్ ను డిటెక్ట్ చేసి కూలింగ్ ను అడ్జస్ట్ చేస్తుంది, ఇది మార్కెట్లో అమ్ముడవుతున్న బెస్ట్ ఏసీ. ఇది కూడా స్మాల్, మీడియం సైజ్ ఉన్న గదులకు సరిగ్గా సరిపోతుంది. దీనిని మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. దీని ధర రూ. 36,490గా ఉంది.
డయాకిన్ 1 టన్ 3 స్టార్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ.. ఈ ఏసీపై 32 శాతం డిస్కౌంట్ ఉంది. ఇది చిన్న గదులకు బాగా సరిపోతుంది. దీనిలో కూడా కాపర్ కండెన్సర్ కాయిల్ ఉంటుంది. 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా చక్కని చల్లదనాన్ని అందిస్తుంది. దీని ధర రూ. 32,990గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..