Portable AC: సమ్మర్‌లో కూల్.. కూల్‌గా.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇంటిని చల్లబరుచుకోండి.. రూ. 500లోపే.!!
మార్కెట్లో ఎయిర్ కూలర్లు, స్ప్లిట్ ఏసీలకు కొరత లేదు. ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే వాటి ధర కొంచెం ఎక్కువే.
![Portable AC: సమ్మర్‌లో కూల్.. కూల్‌గా.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇంటిని చల్లబరుచుకోండి.. రూ. 500లోపే.!!](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/05/mini-ac.jpg?w=1280)
మార్కెట్లో ఎయిర్ కూలర్లు, స్ప్లిట్ ఏసీలకు కొరత లేదు. ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే వాటి ధర కొంచెం ఎక్కువే. ఏసీల కంటే కూలర్లు చౌక అనుకోవచ్చు. కానీ వాటికి ఇంటిలో ఒక రూమ్ నుంచి మరో రూమ్‌కి మార్చాలంటే కొంచెం కష్టమే. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో ఏ చోటకైనా మూవ్ చేసే పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లో ఉన్నాయి. మధ్యతరగతి వారికి ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. మరి మీరు కూడా ఒక పోర్టబుల్ ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే..! ఈ వార్త చదివేయండి.
ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో పోర్టబుల్ మినీ ఏసీ USB బ్యాటరీ పవర్డ్‌తో లభిస్తోంది. దీని అసలు ధర రూ.699 కాగా.. 29 శాతం తగ్గింపుతో రూ. 499కు దొరుకుతోంది. మీరు ఈ ఏసీని ఇంట్లో లేదా ఆఫీసులో ఉపయోగించుకోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. బరువు కూడా తక్కువే. ఈ మినీ ఎయిర్ కూలర్ మన్నికైన హార్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. ఇది డెస్క్‌టాప్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. 3 ఏఏ బ్యాటరీతో లభిస్తోన్న ఈ పోర్టబుల్ ఏసీకి యూఎస్‌బీ కేబుల్‌కు వస్తోంది. దీనితో మీకు విద్యుత్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. దీని బ్యాటరీ 40 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. అంతే కాదు, Amazonలో ఈ పోర్టబుల్ ఏసీ గులాబీ, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, ఊదా, నారింజ రంగులలో అందుబాటులో ఉంది. కాగా, దీన్ని మీరు చదువుకునే రూమ్, నిద్రపోయే రూమ్, లైబ్రరీ, అవుట్ డోర్ ఇలా ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. కాగా, ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆ సైట్ ప్రూఫ్, వస్తువుకు సంబంధించిన కండీషన్‌ను కచ్చితంగా చూసుకోవాలి.