AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Ronin: యూత్‌కు పిచ్చెక్కిస్తున్న టీవీఎస్ బైక్.. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రోనిన్ విడుదల

కొత్త సంవత్సరంలో అనేక రకాల మోటారు సైకిళ్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. వీటిలో కొన్ని కొత్తగా తయారు చేసినవి, మరికొన్ని అప్ గ్రేడ్ చేసిన పాత వెర్షన్ల వాహనాలు ఉంటున్నాయి. ఏది ఏమైనా ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు కొత్త ఫీచర్లతో బైక్ లు మార్కెట్ లోకి వస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ నుంచి రోనిన్ అనే అప్ డేట్ వెర్షన్ బైక్ విడుదలైంది. 2025 ఎడిషనల్ 225 సీసీ మోటారుసైకిల్ ను సేఫ్టీ ఫీచర్లతో అప్ గ్రేడ్ చేసి, రెండు కొత్త రంగుల్లో తీసుకువచ్చారు. దీని ధరను రూ.1.35 లక్షలు (ఎక్స్ ఫోరూమ్)గా నిర్దారణ చేశారు. ఈ బైక్ ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

TVS Ronin: యూత్‌కు పిచ్చెక్కిస్తున్న టీవీఎస్ బైక్.. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రోనిన్ విడుదల
Tvs Ronin
Nikhil
|

Updated on: Feb 20, 2025 | 4:30 PM

Share

గతేడాది గోవాలో జరిగిన మోటోసౌల్ ఈవెంట్ లో టీవీఎస్ రోనిన్ బైక్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం అప్ డేట్ చేసిన వెర్షన్ మార్కెట్ లోకి విడుదలైంది. 2025 మోడల్ వెర్షన్ ను రెండు కొత్త రంగులు, భద్రతా ఫీచర్లతో అప్ గ్రేట్ చేశారు. అలాగే డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఇప్పుడు మిడ్ స్పైక్ డీఎస్ వేరియంట్ నుంచి అందుబాటులోకి వచ్చింది. గతంలో టాప్ స్పెక్ టీడీ ట్రిమ్ లో మాత్రమే లభించేది. రోనిన్ బైక్ ధర రూ.1.35 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.68 లక్షల వరకూ ఉంటుంది. దీనిలోని స్పెషల్ ఎడిషన్ కూడా మన దేశంలో అందుబాటులో ఉంది. దాని ధరను రూ.1.72 లక్షలుగా నిర్ధారణ చేశారు. ఈ బైక్ లో 225.9 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పాత బైక్ మాదిరిగానే ఉన్నాయి. ఇంజిన్ నుంచి 20.1 హెచ్పీ, 19.93 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్ తో 5 స్పీడ్ గేర్ బ్యాక్స్ ను జత చేశారు.

గత మోడల్ లోని టాప్ వేరియంట్ లో డ్యూయల్ చానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు కొత్త వెర్షన్ లో దాన్ని తీసుకువచ్చారు. సీటు తో పాటు అనేక వాటిని రీడిజైన్ చేశారు. హెచ్ లైట్ చుట్టూ కొన్ని మార్పులు తీసుకువచ్చారు. ఇక ఇంజిన్ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది లీటర్ పెట్రోలుకు దాదాపు 42 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తుంది. రైడర్లకు అవసరమయ్యే అనేక ఆధునిక ఫీచర్లను కొత్త బైక్ లో ఏర్పాటు చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఆకట్టుకుంటోంది. దీని వల్ల రైడింగ్ చాలా సులభంగా ఉంటుంది. అలాగే సీటు కూడా చాలా కంఫర్టుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తక్కువ వేగంతో వెళుతున్నప్పుడు ఇంజిన్ ఆగిపోకుండా ఉండటానికి గ్లైడ్ త్రూ ట్రాఫిక్ ఫంక్షన్ ఉంది. ఏబీఎస్ సిస్టమ్ తో పాటు అడ్జస్ట్ బుల్ క్లచ్, బ్రేక్ లివర్లు, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్, ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, టెయిల్ ల్యాంపులు, టర్న ఇండికేటర్లను ఏర్పాటు చేశారు. సైలెంట్ స్టార్టర్ ఆప్షన్ దీనికి అదనపు ఆకర్షణగా ఉంటుంది.

గతుకుల రోడ్డుపై సుఖంగా, సులభంగా ప్రయాణించేందుకు వీలుగా ముందు యూఎస్డీ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యువతకు ఆకట్టుకునేలా కొత్త రోనిన్ ను తీర్చిదిద్దారు. ఈ బైక్ కస్టమర్లకు బాగా ఆకట్టుకుంటుందని, మార్కెట్ లో మిగిలిన బైక్ లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి