Honda Electric Scooter: హోండా యాక్టివా ఈవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడంటే..?

ఎలక్ట్రిక్ వాహనాలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రజలందరూ వీటిని కొనుగోలు చేయడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. పెట్రోలు వాహనాలతో పోల్చితే వీటి విక్రయాలు భారీగా పెరిగాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో పాటు పెరుగుతున్న పెట్రోలు ధరలు కూడా దీనికి కారణం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనమిస్తున్నాయి.

Honda Electric Scooter: హోండా యాక్టివా ఈవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడంటే..?
Honda Electric Scooter
Follow us
Srinu

|

Updated on: Nov 23, 2024 | 4:30 PM

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ విభాగంలో బైక్ లను విడుదల చేశాయి. మరో దిగ్గజ సంస్థ హోండా కూడా తొలి ఈవీని విడుదల చేసేందుకు ముహూర్తం నిర్ణయించింది. నవంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది. హోండా టూ వీలర్స్ ఇండియా విడుదల చేసే వాహనాలకు ప్రజల ఆదరణ ఎంతో బాగుంది. ముఖ్యంగా హోండా యాక్టివా స్కూటర్ ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్కూటర్ల విభాగంలో దీని పేరు అందరికీ సుపరిచితం. మిగిలిన కంపెనీల స్కూటర్లు మార్కెట్ ఉన్నా హోండా యాక్టివాకే కొనుగోలుదారులు తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలవుతున్న యాక్టివా ఈవీపై కూడా మార్కెట్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రజల ఆదరణ పొందిన బ్రాండ్ కావడంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. మార్కెట్ లో ఇప్పటికే విడుదలైన ప్రముఖ ఈవీలకు యాక్టివా ఈవీ గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు ఈ విభాగంలో వాహనాలను విడుదల చేశాయి. కానీ హోండా మాత్రం ఇప్పటి వరకూ ఈవీ విభాగంలోకి రాలేదు. కొంచె ఆలస్యం అయినప్పటికీ ఈవీ మార్కెట్ లో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవడానికి హోండా చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా యాక్టివాను ఎలక్ట్రిక్ విభాగంలో విడుదల చేయనుంది. జపాన్ కు చెందిన హోండా కంపెనీ తన యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ ను ఇటీవల విడుదల చేసింది. నవంబర్ 27వ తేదీన ఈ స్కూటర్ ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. దీర్ఘచతురస్రాకార ఎల్ ఈడీ హెడ్ లైట్లు, రీమూవబుల్ బ్యాటరీలతో ఎంతో ఆకట్టుకుంటోంది. అదుర్స్ అనిపించే డిజైన్, ముందు అప్రాన్ పై హెడ్ లైట్, ఫ్లఫ్ పిట్టింగ్ పిలియన్ ఫుట్ రెస్టులు, టైల్ లైట్ బార్ ఆకట్టుకుంటున్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే ఏడు అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే, కీలెస్ గో, ఎల్ ఈడీ లైటింగ్, యూఎస్బీ సీ సాకెట్, మూడు రైడింగ్ మోడ్ లు, రివర్స్ అసిస్ట్ ఏర్పాటు చేశారు. ఇక కనెక్టివిటీ ఫంక్షన్ల కోసం హోండా రోడ్ సింక్ డ్యుయో యాప్ ను కూడా అందిస్తున్నారు. అయితే సీట్ కింద ఏర్పాటు చేసిన రిమూవబుల్ బ్యాటరీల కారణంగా స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉండదు. హోండా యాక్టివా ఈవీ పనితీరు గతంలో విడుదలైన 125 సీసీ ఐసీఈ స్కూటర్ మాదిరిగానే ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు వంద కిలోమీటర్ల మైలేజీ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ యాక్టివా గురించి మరింత స్పష్టమైన సమాచారం దాని విడుదల సమయంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే