Defog car windows: శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం

శీతాకాలం నేపథ్యంలో వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఉష్టోగ్రతలు బాగా తగ్గిపోయి చలి ఎక్కువైంది. తెల్లవారుజామున మంచు పరదాలు రోడ్డును కప్పేస్తున్నాయి. రాత్రి సమయంలో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. ఈ వాతావరణంగా కార్లలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Defog car windows: శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
Defog Car Windows
Follow us
Srinu

|

Updated on: Nov 23, 2024 | 4:15 PM

మంచు కారణంగా కారు విండ్ స్క్రీన్ తో పాటు సైడ్ అద్దాలపై నీటి బిందువులు పేరుకుపోతుంటాయి. వీటి కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించక డ్రైవింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమయలో డీఫాగర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. దేశంలో చలి క్రమంగా పెరుగుతోంది. దక్షిణాదితో పోల్చితే ఉత్తర భాగంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. పొగమంచు విపరీతంగా కమ్ముకుంటోంది. ఈ సమయంలో కార్లలో ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా కారులో వాతావరణం వెచ్చగా ఉంటుంది. బయటేమో చలిగా మారుతుంది. దీంతో కారు కిటికీల ఉపరితలంపై మంచు ఏర్పడుతుంది. ఇది మీ డ్రైవింగ్ సామర్థ్యానికి పరీక్ష పెడుతుంది.

కారు అద్దాలపై ఏర్పడిన మంచు బిందువులను తొలగించడానికి డీ ఫాగర్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి కారులోని ఓ రకమైన పరికరాలు. ముందు వెనుక విండ్ స్క్రీన్లతో పాటు సైడ్ అద్దాలను శుభ్రం చేయడానికి వీటిని ఏర్పాటు చేశారు. శీతాకాలం, వర్షాకాలాలలో ఢీ ఫాగర్ల వినియోగం ఉంటుంది. కారు ముందు, వెనుక అద్దాల నుంచి రోడ్డును స్పష్టంగా చూడటానికి ఇవి చాలా అవసరం. కారులోని ముందు, వెనుక భాగాలలో ఢీఫాగర్లు ఉంటాయి. కారుకు ముందు భాగంలో ఉండే విండ్ షీల్డ్ (అద్దం) పై మంచు బిందువులు పేరుకుపోతే డ్రైవింగ్ అస్సలు చేయలేము, వాటిని తొలగించడానికి కారులోని హీటింగ్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ (హెచ్ వీఏసీ)ను ఉపయోగించుకోవచ్చు. ఈ సిస్టమ్ ను ఆన్ చేయగానే విండ్ షీల్డ్ బేస్ లోని వెంట్ లకు వెచ్చిన గాలి వెళుతుంది. ఇది అద్దం ఉపరితలమంతా వ్యాపిస్తుంది. దీంతో పొగమంచు తొలగిపోతుంది.

వెనుక విండ్ షీల్డ్ ఫాగర్ హెచ్ వీఏసీ సిస్టమ్ తో పనిచేయదు. దీన్ని వేడి చేయడానికి విద్యుత్ ను ఉపయోగించాలి. దానిలోని సన్నని గ్రిడ్ లకు విద్యుత్ వెళ్లడంతో వేడెక్కుతాయి. దీంతో విండ్ షీల్డ్ పై పేరుకుపోయిన మంచు కరిగిపోతుంది. మరికొన్ని పద్ధతుల ద్వారా కారు అద్దాలపై పొగమంచు, తేమను తొలగించవచ్చు. కారులో సిలికాజెల్ గుళికలను ఉంచుకోవచ్చు. ఇవి తేమను తొలగించడానికి ఉపయోగపడతాయి. అలాగే విండ్ షీల్డ్ పై షేవింగ్ ఫోమ్ ను స్ప్రే చేయాలి. పొడి టవల్ తో దాని తుడిస్తే అద్దం మెరిసిపోతుంది. వెనిగర్ లేదా డిష్ సోప్ తో నీటిని కలిపి అద్దాలపై చల్లాలి. దాన్ని మొత్తటి గుడ్డతో తుడిచినా ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటి?
వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటి?