AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఇది లేకపోతే రోజు గడవదు.. ఈ వ్యాపారంతో నష్టం అనేదే ఉండదు

ప్రస్తుతం వ్యవసాయంపై మక్కువ పెరుగుతోంది. ముఖ్యంగా యువత వినూత్న పద్ధతుల్లో వ్యవయాసం చేస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. నిత్యం డిమాండ్ ఉండే అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం...

Business Idea: ఇది లేకపోతే రోజు గడవదు.. ఈ వ్యాపారంతో నష్టం అనేదే ఉండదు
Business Idea
Narender Vaitla
|

Updated on: Nov 23, 2024 | 1:02 PM

Share

ఏ వ్యాపారం చేయాలన్నా ముందుగా వచ్చే అనుమానం వ్యాపారం బాగా నడుస్తుందా లేదా అనే. అయితే ప్రతీరోజూ అవసరపడే వస్తువులను వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు పొందొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో కొత్తమీర ఒకటి. మార్కెట్లో ఎన్ని రకాల కూరగాయలు కొనుగోలు చేసినా చివరిలో కొత్తమీర లేనిది తిరిగిరాము. ఇలాంటి కొత్తమీరను పెంచడం ద్వారా ఊహకందని లాభాలను ఆర్జించవచ్చని చెబుతుంటారు.

కొత్తిమీర సాగుకు పెద్దగా స్థలం, పెట్టుబడి కూడా అవసరం లేదు. మార్కెట్లో నిత్యం డిమాండ్‌ ఉండే కొత్తిమీర సాగుతో చాలా మంది రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంతకీ కొత్తిమీర సాగు చేయడానికి ఎంత పెట్టుబి అవసరం ఉంటుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎకరా స్థలంలో కొత్తమీర సాగు చేయడానికి కేవలం రూ. 15 నుంచి రూ. 20 వేలు మాత్రమే అవుతోంది. ఒక ఎకరాలో పండిన కొత్తమీరను విక్రయించడం ద్వారా సుమారు రూ. 50 నుంచి రూ. 60 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చు.

ఈ లెక్క చూసుకుంటే ఎకరానికి సుమారు రూ. 35 వేల నుంచి రూ. 40 వేల వరకు లాభం పొందొచ్చన్నమాట. ఇక కొత్తమీర సాగును అక్టోబర్‌ నెలలో ప్రారంభిస్తే మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఎకరంన్నర పొలంలో 15 నుంచి 20 కిలోల విత్తనాలను వసుకోవచ్చు. ఇక నీరు కూడా తక్కువే అవసరపడుతుంది. డ్రిప్‌ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా కొత్తమీర పంట రెండున్నర నుంచి మూడు నెలల్లో చేతికి వస్తుంది. కానీ రైతులు దాని పచ్చి ఆకులను విత్తిన ఒక నెల తర్వాత విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు.

ఖాళీ స్థలం ఉండి మంచి నీటి సదుపాయం ఉంటే కొత్తమీర బెస్ట్‌ వ్యాపారంగా భావించాలి. కొత్తమీరను మార్కెట్లలో హోల్‌ సేల్‌లో విక్రయించుకోవడం వల్ల మంచి లాభాలు ఆర్జించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక్క కొత్తమీర కట్ట రూ. 5 పలికిన సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్‌ నాటికి పంట చేతికొచ్చేలా ప్లాన్‌ చేసుకుంటే లక్షల ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!