Royal Enfield EV: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ మరింత ఆలస్యం.. కారణం చెప్పిన కంపెనీ ఎండీ
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. అటు ఎలక్ట్రిక్ టూవీర్, ఫోర్ వీల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఇక దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. రోజురోజుకు అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రాగా, మరికొన్ని స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ద్విచక్ర వాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశీయంగా..
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. అటు ఎలక్ట్రిక్ టూవీర్, ఫోర్ వీల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఇక దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. రోజురోజుకు అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రాగా, మరికొన్ని స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ద్విచక్ర వాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశీయంగా బుల్లెట్, క్లాసిక్ 350, హంటర్ వంటి వాహనాలను విక్రయిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ రంగంలో అడుగు పెట్టబోతోంది. 2025 సంవత్సరం నాటికి భారతీయ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చేందుకు తాము తొందర పడటం లేదని రాయల్ ఎన్‌ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్ చెబుతున్నారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఆలస్యం కావడానికి కారణాలు సైతం వెల్లడించారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్ద ఎత్తున బ్యాటరీలు అవసరమని, ప్రస్తుతం బ్యాటరీలు సైజు పరంగా పెద్దగా ఉన్నాయని, వాటి బరువు కూడా అధికంగా ఉంటోందని ఆయన అన్నారు. అంతేకాదు బ్యాటరీ ఖరీదు కూడా ఎక్కువే ఉందని, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఖర్చు భారీగా పెరిగిపోతోందని అన్నారు. దీంతో బైక్ ధర కూడా ఎక్కువ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెద్దగా ఏర్పడలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాటరీల బరువు తగ్గి, వాటి ధరలు అందుబాటులోకి వచ్చేవరకు ఆశించిన స్థాయిలో డిమాండ్ ఉండకపోవచ్చని అన్నారు. ప్రస్తుతానికి తాము సొంతంగా ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేస్తున్నామని అన్నారు. స్పెయిన్‌కు చెందిన స్టార్క్ మోటార్ సైకిల్‌తో మరో ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నామని, వీటిని మార్కెట్లో ఎప్పుడు విడుదల చేసేది వెల్లడించలేదు. స్టార్క్ ఫ్యూచర్ కంపెనీతో 2022లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి