Indian Railways: ఇలా చేస్తే..! తత్కాల్ టికెట్‌పై ఈజీగా బెర్త్ కన్ఫర్మ్ కావడం పక్కా..

రైల్వే ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఐఆర్‌సీటీసీ ఎప్పుడూ తమ పోర్టల్‌లో కీలక మార్పులు చేస్తుంటుంది. సాధారణంగా ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్టు ఉన్న టికెట్లకు బెర్త్‌లు 50:50 నిష్పత్తిలో దొరుకుతుంటాయి. అయితే కొన్నిసార్లు కంగారుగా అప్పటికప్పుడు ప్రయాణం చేయాలనుకున్నవారు తత్కాల్‌లో టికెట్లు బుక్ చేస్తుంటారు.!

Indian Railways: ఇలా చేస్తే..! తత్కాల్ టికెట్‌పై ఈజీగా బెర్త్ కన్ఫర్మ్ కావడం పక్కా..
Indian Railways
Follow us
Ravi Kiran

|

Updated on: May 14, 2024 | 8:07 AM

రైల్వే ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఐఆర్‌సీటీసీ ఎప్పుడూ తమ పోర్టల్‌లో కీలక మార్పులు చేస్తుంటుంది. సాధారణంగా ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్టు ఉన్న టికెట్లకు బెర్త్‌లు 50:50 నిష్పత్తిలో దొరుకుతుంటాయి. అయితే కొన్నిసార్లు కంగారుగా అప్పటికప్పుడు ప్రయాణం చేయాలనుకున్నవారు తత్కాల్‌లో టికెట్లు బుక్ చేస్తుంటారు.! మరి వారికి బెర్త్‌లు దొరకకపోతే.. పరిస్థితి ఏంటి.? ఐఆర్‌సీటీసీ పోర్టల్ తత్కాల్ టికెట్ల కోసం ఓపెన్ చేయగానే.. క్షణాల్లో హ్యంగ్ అయిపోతుంది. కేవలం అంకెల్లో.. కొందరికి మాత్రమే తత్కాల్ ద్వారా బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. మరి తత్కాల్‌లో బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలను మీరు పాటించాలి.

ఏసీ టికెట్ల కోసం తత్కాల్ విండో ప్రతీ రోజూ ఉదయం 10 గంటలకు.. అలాగే స్లీపర్ క్లాస్ టికెట్ల కోసం తత్కాల్ బుకింగ్ విండో ప్రతీ రోజూ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపుగా అన్ని రోజులు ఈ సమయాల్లో తత్కాల్ టికెట్ బుకింగ్ కచ్చితంగా రద్దీగా ఉంటుంది. టికెట్లు కూడా క్షణాల్లో కంప్లీట్ అయిపోతాయి కూడా. అలాంటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే.. తత్కాల్ టికెట్లను బుక్ చేసేటప్పుడు.. ఆప్షన్‌గా తత్కాల్‌ను బదులుగా ప్రీమియం తత్కాల్‌ను ఎంచుకోండి. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. కానీ బెర్త్ మాత్రం మీకు 90 శాతం దొరుకుతుంది. అలాగే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మీరు పాసెంజర్ల వివరాలను ముందుగా నమోదు చేసుకుని ఉంటే.. త్వరత్వరగా పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కచ్చితంగా ఈసారి తత్కాల్ టికెట్లు బుక్ చేసేటప్పుడు ఈ ఆప్షన్లు ఒకసారి ప్రయత్నించండి.