Business Idea: ఉన్న ఊర్లోనే ఉంటూ.. కోటీశ్వరులయ్యే ఛాన్స్‌. బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌..

సరైన ప్రణాళిక, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే లాభాలు ఆర్జించడం పక్కా. అలాంటి ఓ మంచి బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చిన్నారులు ఇష్టపడి తినే చిరు తిళ్లకు భారీగా డిమాండ్‌ ఉంటోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కిరాణం దుకాణాల్లో దొరికే కార్న్‌తో తయారు చేసే స్నాక్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. కేవలం చిన్నారులే కాకుండా పెద్దలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా...

Business Idea: ఉన్న ఊర్లోనే ఉంటూ.. కోటీశ్వరులయ్యే ఛాన్స్‌. బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌..
Business Idea
Follow us

|

Updated on: May 14, 2024 | 8:27 AM

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఉద్యోగం చేస్తే వచ్చే జీతం కంటే వ్యాపారంలో అధికంగా ఆర్జించవచ్చే ఆలోచనలో ఉంటారు. అందుకే ఎప్పటికైనా ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆశయంతో ఉంటారు. అందుకోసం ప్రణాళికలు రచిస్తుంటారు. అయితే పెద్ద వ్యాపారం చేయాలంటే కేవలం పట్టణాల్లోనే ఉండాలనే ఆలోచనలో మనలో చాలా మందికి ఉంటుంది. కానీ నిజానికి ఉన్న ఊర్లోనే ఉంటూ కోట్లలో సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి.

సరైన ప్రణాళిక, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే లాభాలు ఆర్జించడం పక్కా. అలాంటి ఓ మంచి బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చిన్నారులు ఇష్టపడి తినే చిరు తిళ్లకు భారీగా డిమాండ్‌ ఉంటోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కిరాణం దుకాణాల్లో దొరికే కార్న్‌తో తయారు చేసే స్నాక్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. కేవలం చిన్నారులే కాకుండా పెద్దలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఇలాంటి స్నాక్స్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తే కోట్లలో లాభాలు ఆర్జించవచ్చు. అంతేనా మీతో పాటు మరో నలుగురికి ఉపాధి సైతం కల్పించవచ్చు. ఇంతకీ ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? ఏ మిషనరీ అవసరపడుతుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్నాక్స్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభించాలంటే ఒక పెద్ద గది ఉండాలి. అలాగే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్ పొంది ఉండాలి. ఇక ఇందుకోసం కొన్ని రకాల మిషిన్స్‌ అవసరపడతాయి. పోలో రింగ్స్‌ వంటి అన్ని రకాల స్నాక్స్‌ను తయారు చేయడానికి కార్న్‌ పౌడర్‌ అవసరపడుతుంది. కార్న్‌ను రవ్వాలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ముడి వస్తువు కూడా రడీగా లభిస్తోంది. ఇక ఈ కార్న్‌ రవ్వను ఒక మిషన్‌లో వేయాల్సి ఉంటుంది. మనకు ప్రొడక్ట్‌ ఏ రూపంలో రావాలో సెట్ చేసుకునేందుకు ఒక పరికరం ఉంటుంది. దాంతో స్నాక్‌ ఆకారం వస్తుంది.

రింగ్స్‌ తయారైన తర్వాత వాటిని సేకరించి. తర్వాత రోస్టింగ్ మిషిన్‌లో వేసి హీట్‌ సెట్‌ చేసుకుంటే. రింగ్స్‌ రోస్ట్‌ అవుతాయి. ఆ తర్వాత ఈ రింగ్స్‌కు మసాలా మిక్స్‌ చేయడానికి మరో మిషన్‌ అందుబాటులో ఉంటుంది. వాటిలో రింగ్స్‌ను వేసి, మసాలా యాడ్ చేసి మిషన్‌ అనే చేస్తే రింగ్స్‌ మొత్తానికి మసాలా పడుతుంది. అంతే ఇక ఫైనల్‌గా రింగ్స్‌ను ప్యాకేజ్‌ చేయడానికి మరో మిషన్‌ అందుబాటులో ఉంటుంది. అందులో వేసి రింగ్స్‌ను మీకు నచ్చిన బ్రాండ్‌తో ప్యాక్‌ చేసి సేల్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా హోల్‌సేల్‌గా సేల్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఈ బిజినెస్‌ను స్టార్ట్‌ చేయడానికి మొత్తం నాలుగు యంత్రాలు అవసరపడతాయి. సుమారుగా ఈ వ్యాపారాన్ని రూ. 10 లక్షల పెట్టుబడితో ప్రాంరభించవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించి యూట్యూబ్‌లో పలు వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో మిషనరీ వివరాలు లాంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే యూట్యూబ్‌లో పేర్కొన్న వారితో సంప్రదించే సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో డబ్బులు తీసుకొని మోసం చేసే వారు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!