AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: కనీసం సొంతిల్లు లేదంటున్న ప్రపంచ కుబేరుడు.. ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటాడంట..

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనికవంతుడైన టెస్లా చీఫ్ ఎలాన్‌ మస్క్‌కు సొంతిళ్లు లేదట. అంత ఆస్తి ఉన్న వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుంది? కానీ.. ఎలాన్ మస్క్ ఏమంటున్నారంటే..

Elon Musk: కనీసం సొంతిల్లు లేదంటున్న ప్రపంచ కుబేరుడు.. ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటాడంట..
Elon Musk
Ayyappa Mamidi
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 20, 2022 | 11:57 AM

Share

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన టెస్లా(Tesla) సీఈవో ఎలాన్‌ మస్క్‌కు సొంతిళ్లు లేదట. అంత ఆస్తి ఉన్న వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుంది? ఇంద్రభవనాల్ని తలపించే బంగ్లాలు.. అత్యంత ఖరీదైన కార్లు, విమానాలు.. అందమైన దేశాలకు విహార యాత్రలు.. ఇలా సకల విలాసాలు ఉంటాయని అందరూ అనుకుంటుంటారు. కానీ.. ఎలాన్​ మస్క్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇప్పటి వరకు తనకు నివసించేందుకు సొంతిళ్లంటూ కూడా లేదని, స్నేహితుల ఇళ్లలోనే తాను ఉంటున్నట్టు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం 250 బిలియన్ డాలర్లకు పైగా.. అంటే మన భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.19,06,730 కోట్లకు పైగా సంపద కలిగి ఉన్నారు. కానీ.. తనకు కనీసం సొంతిల్లు కూడా లేదని ఎలాన్ మస్క్‌ చెప్పడం ప్రతి ఒక్కరినీ ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటి వరకు నాకు సొంత ప్లేస్ అంటూ ఏదీ లేదు. నేను నా స్నేహితుల ఇళ్లల్లో ఉంటున్నానని టెడ్ కాన్ఫరెన్స్ ఆర్గనైజర్స్ హెడ్ క్రిస్ ఆండెర్సన్‌కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ చెప్పారు. ఒకవేళ టెస్లా ఇంజనీరింగ్ వర్క్ జరిగే ప్రదేశాలకు వెళ్తే.. స్నేహితుల ఇళ్లలో ఉండే అదనపు బెడ్‌రూమ్‌లలోనే తాను స్టే చేస్తానని టెడ్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. మస్క్ సిలికాన్ వ్యాలీకి వస్తే.. ఈ రాత్రికి నేను ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. మీ ఇంటికి రానా?” అని మెయిల్ చేసేవారని 2015లో వెల్లడించారు గూగుల్ సహవ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ తెలిపారు. తన వ్యక్తిగత అవసరాల కోసం కోట్ల కొద్ది డబ్బులను ఖర్చు చేస్తే అది చాలా సమస్యాత్మకం అవ్వొచ్చని.. కానీ తాను అలాంటి వాటికి దూరంగా ఉంటానని మస్క్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం తనకు సొంత యాచెట్ కూడా లేదని తెలిపారు. కానీ తనకు ఒక విమానం ఉందని, దాన్ని కూడా ఎక్కువగా వాడనని తెలిపారు.

పనిచేసేందుకు చాలా తక్కువ గంటలే కేటాయిస్తానని మస్క్ అంటున్నారు. ఎలాన్ మస్క్ తనకు సొంతిళ్లు లేదని చెప్పటం ఇదే తొలిసారి. ప్రపంచ కుబేరుడికి సొంతిళ్లు లేకపోవడమన్నది ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరిచింది. తనకున్న అన్ని స్థిరాస్తులను అమ్మేసినట్టు మస్కు 2020లోనే ట్విటర్‌ ద్వారా తెలిపారు. స్పేస్ఎక్స్ నుంచి అద్దెకు ఓ చిన్నపాటి ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇంట్లో ఎలాన్ మస్క్ నివసిస్తున్నారని 2021 ఆగస్టులో ఒక వార్తా సంస్థ వెల్లడించింది. కొన్ని సార్లు దారిద్య్ర రేఖకు దిగువన కూడా నివసించాల్సి వస్తుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ మాజీ భాగస్వామి, కెనడియన్ సింగిన్ గ్రిమ్స్ అన్నారు.

ఇవీ చదవండి..

Petrol-Diesel Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. 14రోజుల తర్వాత ఎలా ఉన్నాయంటే?

Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం