AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chitra Ramakrishna: తనపై ఆరోపణలు పక్షపాతపూరితమన్న చిత్రా రామకృష్ణ.. సెబీ ఆరోపణలపై తీవ్ర వ్యాఖ్యలు..

Chitra Ramakrishna: NSE మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ తనపై SEBI చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. సుబ్రమణియన్‌ నియామకంపై మాట్లాడుతూ.. రెగ్యులేటర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆమె కౌంటర్ ఇచ్చారు.

Chitra Ramakrishna: తనపై ఆరోపణలు పక్షపాతపూరితమన్న చిత్రా రామకృష్ణ.. సెబీ ఆరోపణలపై తీవ్ర వ్యాఖ్యలు..
Chitra Ramakrishna
Ayyappa Mamidi
|

Updated on: Apr 19, 2022 | 9:27 AM

Share

Chitra Ramakrishna: NSE మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ తనపై SEBI చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. సుబ్రమణియన్‌ నియామకంపై మాట్లాడుతూ.. రెగ్యులేటర్ కొన్ని సాక్ష్యాలను ఎంచుకుని, కేసులోని అనేక అంశాలను సందర్భోచితంగా పరిగణలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఆమె సంప్రదించిన హిమాలయ యోగి సమస్యను ప్రస్తావిస్తూ.. ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి నుంచి అనధికారిక మార్గదర్శకత్వం కోరడం తప్పు కాదు అని రామకృష్ణ వాదించారు. ప్రజా ప్రయోజనాలను లేదా సెక్యూరిటీల మార్కెట్‌ను దెబ్బతీసేందుకు సలహాలను దుర్వినియోగం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆమె పేర్కొన్నారు. ఆనంద సుబ్రమణియన్‌కు నియామకం, పరిహారం భారీగా పెంపు గురించి మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఇ ఉద్దేశపూర్వకంగా వేరే నేపథ్యానికి చెందిన వ్యక్తిని తీసుకోవాలని నిర్ణయించటమే కారణమని ఆమె పేర్కొన్నారు. సుబ్రమణియన్ నియామకం అతని పనితీరు, కొత్త అంశాలను త్వరగా గ్రహించగల సామర్థ్యం, ప్రభుత్వ రంగంలో సుదీర్ఘ కార్యాచరణ అనుభవంపై ఆధారపడి ఉందని ఆమె పేర్కొన్నారు. సుబ్రమణియన్ నియామక నిర్ణయాత్మక ప్రక్రియలో ఇతరులు పాలుపంచుకున్నప్పటికీ.. సెబీ ఉత్తర్వులు తనను ఒంటరిగా బాధ్యురాలిగా చేసిందని రామకృష్ణ ఆరోపించారు.

NSEలో సుబ్రమణియన్‌కు అప్పగించిన విధులు పాత్రను, బాధ్యతలను పరిగణనలోకి తీసుకుంటే గతంలో అతను పొందిన జీతానికి సంబంధం లేదని రామకృష్ణ వాదించారు. తన ఆధ్యాత్మిక సలహాదారు నిజమైన గుర్తింపు తనకు తెలియదని ఆమె అన్నారు. ఒకవేళ కొందరు చెబుతున్నట్లు తన ఆధ్యాత్మిక గురువుగా సుబ్రమణియన్‌ ఉన్నట్లయితే.. అందరూ ఆరోపిస్తున్నట్లుగా NSE సమాచారాన్ని బయట వ్యక్తితో పంచుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు చెల్లవని ఆమె నొక్కి చెప్పారు. అలాంటప్పుడు సుబ్రమణియన్ ఉద్యోగి అవుతాడని ఆమె వాదించారు. సుబ్రమణియన్ యోగిగా మారాల్సిన అవసరం లేదని CNBC వార్తా సంస్థ నివేదించింది. ఎందుకంటే అతనితో చిత్ర పంచుకున్న సమాచారాన్ని.. అతను ఇప్పటికీ గోప్యంగా ఉంచాడని వివరించింది. ఎటువంటి కమ్యూనికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలు లేనప్పటికీ, యోగి తమకు 22 సంవత్సరాలుగా తెలుసునని రామకృష్ణ మరియు సుబ్రమణియన్‌ల వాదనలతో మింట్ వార్తా సంస్థ విశ్వసిస్తోంది. బోర్డు నుంచి సీనియర్ మేనేజ్‌మెంట్ వరకు అందరికీ లోపల జరుగుతున్న విషయాలు తెలుసని.. వాటిని దాటి పెట్టడంలో చిత్రకు అందరూ సహకరించారని ది వైర్ వార్తా పత్రిక అంటోంది.

చిత్రకు ఉపశమనం..

హిమాలయ యోగి కేసులో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణకు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ఆరు వారాల్లోగా రూ.2 కోట్లు డిపాజిట్‌ చేయాల్సిందిగా రామకృష్ణను ఆదేశించింది. ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేస్తే.. మిగతా మొత్తాన్ని అప్పీలు సమయంలో రికవరీ చేయరాదని శాట్‌ సభ్యులు తరుణ్‌ అగర్వాలా, మీరా స్వరూప్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

SBI: బ్యాంకులో దొంగలు పడ్డారు.. ఏస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల నాణేలు మాయం.. రంగంలోకి సీబీఐ

Elon Mask: కనీసం సొంతిల్లు లేదంటున్న టెస్లా సీఈవో.. ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటాడంట..!