AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla Cars Recall: దాదాపు 3లక్షల కార్లను వెనక్కి రప్పించిన టెస్లా కంపెనీ.. ఆ దేశంలో తయారైన వాటిని మాత్రమే!

అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కొత్తగా రూపొందించిన రెండు మోడళ్ల కార్లను వెనక్కి పిలిపించనుంది. ఈ రెండు మోడళ్లు కూడా చైనాలో తయారైనవే కావడం విశేషం.

Tesla Cars Recall: దాదాపు 3లక్షల కార్లను వెనక్కి రప్పించిన టెస్లా కంపెనీ.. ఆ దేశంలో తయారైన వాటిని మాత్రమే!
Tesla Cars
Balaraju Goud
|

Updated on: Jun 28, 2021 | 7:37 PM

Share

Tesla Addresses Safety Issue: అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కొత్తగా రూపొందించిన రెండు మోడళ్ల కార్లను వెనక్కి పిలిపించనుంది. ఈ రెండు మోడళ్లు కూడా చైనాలో తయారైనవే కావడం విశేషం. చైనా రెగ్యులేట్స్ ఆదేశాల మేరకు వాటిని రీకాల్ చేయనున్నట్లు టెస్లా కంపెనీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేసిన వారు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ టెస్లా.ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేయడంలో టాప్ ఆటొమొబైల్ కంపెనీగా పేరు సాధించింది. టెస్లా సంస్థ చైనాలో 2,85,000 విద్యుత్తు వాహనాలను వెనక్కి పిలిపించింది. క్రూయిజ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఒక్కసారిగా యాక్టివేట్‌ అయ్యి, ఒక్కసారిగా వేగం పెరిగే ప్రమాదం ఉన్నందునే, వీటిని సరిచేసేందుకు వెనక్కు పిలిపిస్తున్నట్లు తెలిపింది. ఇందులో 35,665 కార్లు మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకోగా, మిగిలినవన్నీ చైనాలో తయారైనవే. 2019 డిసెంబరు నుంచి 2021 జూన్‌ మధ్య తయారైన మోడళ్లే ఇవన్నీ. కార్ల యజమానులు కంపెనీ షోరూమ్స్‌ల్లో తమ కారును తీసుకెళ్తే, క్రూయిజ్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామని టెస్లా తెలిపింది. కొనుగోలుదారులు కార్లను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకుని, మళ్లీ తిరిగి పొందవచ్చని స్పష్టం చేసింది.

చైనాలో ఈ కంపెనీ యూనిట్లు ఉన్నాయి. మోడల్ 3, మోడల్ వై కార్లు చైనాలోనే తయారయ్యాయి. మోడల్ 3 కారు ధర భారత్‌లో 60 లక్షల రూపాయలు ఉంటోంది. కాగా. మోడల్ వై ప్రైస్ 50 లక్షలకు పైమాటే. ఈరెండు మోడల్స్‌ను టెస్లా కంపెనీ యాజమాన్యం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ రెండు మోడళ్ల కార్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉన్నందున.. వాటిని రీకాల్ చేసినట్లు టెస్లా తెలిపింది. మొత్తం 2,49,855 కార్లను రీకాల్ చేసినట్లు పేర్కొంది. రెండు మోడళ్లను తొలిసారిగా షాంఘైలో తయారు చేస్తోంది టెస్లా కంపెనీ. ఒక్క మేలోనే 33,463 కార్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. ఈ రెండింటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నట్లు వివరించింది.

Read Also…  Viral Video: గుంపుగా వచ్చిన సింహాలను సింగల్‌గా ఎదిరించిన అడవిదున్న.. గగుర్పొడిచే వీడియో వైరల్!