AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Term vs Life Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ -లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మధ్య తేడా ఏమిటి?

మీరు బీమా చేస్తున్నట్లయితే ముందుగా ఎలాంటి ప్లాన్‌లు సరిపోతాయో ఆలోచించడం మంచిది. చాలా సార్లు ఏజెంట్లు తమకు ఎక్కువ లాభం తెచ్చే ప్లాన్‌లను మార్కెట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంతిమంగా, మీకు అవసరం లేని బీమా పాలసీ మీపై భారం అవుతుంది. వివిధ రకాల బీమాలు ఉన్నాయి. టర్మ్ బీమాను స్థూలంగా జీవిత బీమా, సాధారణ బీమా, ఆరోగ్య బీమాగా వర్గీకరించవచ్చు.

Term vs Life Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ -లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మధ్య తేడా ఏమిటి?
Insurance Policy
Follow us
Subhash Goud

|

Updated on: Jun 19, 2024 | 10:56 AM

మీరు బీమా చేస్తున్నట్లయితే ముందుగా ఎలాంటి ప్లాన్‌లు సరిపోతాయో ఆలోచించడం మంచిది. చాలా సార్లు ఏజెంట్లు తమకు ఎక్కువ లాభం తెచ్చే ప్లాన్‌లను మార్కెట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంతిమంగా, మీకు అవసరం లేని బీమా పాలసీ మీపై భారం అవుతుంది. వివిధ రకాల బీమాలు ఉన్నాయి. టర్మ్ బీమాను స్థూలంగా జీవిత బీమా, సాధారణ బీమా, ఆరోగ్య బీమాగా వర్గీకరించవచ్చు. ఎల్‌ఐసీ నిర్వహించే టర్మ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: AC Side Effects: గంటల తరబడి ఏసీలో కూర్చొని నేరుగా బయటకు వెళ్తున్నారా? డేంజరే..!

టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

టర్మ్‌ అంటే వ్యవధి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిర్ణీత కాలానికి కవరేజీని అందించే ప్లాన్. అంటే, మీరు 30 ఏళ్లపాటు రూ.50 లక్షల కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకుందాం. మీరు మరణిస్తే మీ వారసులకు రూ.50 లక్షలు అందుతాయి. కానీ, ఇది 30 ఏళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. 30 ఏళ్ల తర్వాత పాలసీ గడువు ముగుస్తుంది.

ఇది కూడా చదవండి: School Holidays: సంచలన నిర్ణయం.. జూలై 1 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..

జీవిత బీమా అంటే ఏమిటి?

పాలసీదారు జీవించి ఉన్నంత కాలం జీవిత బీమా చెల్లుబాటు అవుతుంది. వ్యక్తి చనిపోయిన తర్వాత, వారసులకు డబ్బు వస్తుంది.

టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు, అప్రయోజనాలు తెలుసుకోండి..

నిర్ణీత వ్యవధి తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినప్పటికీ, దాని ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు ముప్పై సంవత్సరాల పాటు కోటి రూపాయల కవరేజీని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే, మీరు నెలకు చెల్లించే ప్రీమియం దాదాపు రూ.900 అవుతుంది. మీరు ఈ మొత్తానికి జీవిత బీమా పథకాన్ని పొందినట్లయితే, నెలవారీ ప్రీమియం రూ. 21,000 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రిస్క్ కవరేజీ కోసం ఒక స్కీమ్‌ లాంటిది. ఒక విధంగా ఆరోగ్య బీమా లాంటిది.

మీరు జీవించి ఉన్నప్పుడే బీమా సొమ్ము పొందాలనుకుంటే, జీవిత బీమాలో ఎండోమెంట్ పాలసీని చేసుకోవచ్చు. లేదంటే తక్కువ ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు మెచ్యూరిటీ తర్వాత అంత ప్రీమియం డబ్బును తిరిగి ఇస్తాయి. వీటికి ప్రీమియం కాస్త ఎక్కువగానే ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: Internet: మీ మొబైల్‌లో నెట్‌ స్లో అవుతుందా? ఇలా చేయండి సూపర్‌ఫాస్ట్ అవుతుంది

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి