ఇంటర్నెట్ ట్రాఫిక్ ఉంటే, ఒక ప్రదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఉంటే నెట్‌వర్క్ జామ్ అవుతుంది. దీని వల్ల ఇంటర్నెట్ స్లో అవుతుంది. దీంతో కాల్స్ కూడా మధ్యలో డ్రాప్ అవుతాయి. అలాంటప్పుడు వైఫై ఉంటే, దాన్ని ఉపయోగించండి. తక్కువ డేటాను ఉపయోగించే యాప్‌లను ఉపయోగించండి. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉంచుకోండి. పాత సాఫ్ట్‌వేర్ నెట్‌వర్క్ కనెక్టివిటీకి సమస్యలను కలిగిస్తుంది. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.