TCS: భారీ లాభాలను ప్రకటించిన టీసీఎస్.. 14.1 శాతం వృద్ధి.. డివిడెండ్ ప్రకటన..

దేశంలోఅతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ ప్టెంబర్​తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను(tcs quarterly results ) శుక్రవారం విడుదల చేసింది. రూ .9,624 కోట్ల నికర లాభం వచ్చినట్లు నివేదికలో పేర్కొంది.

TCS: భారీ లాభాలను ప్రకటించిన టీసీఎస్.. 14.1 శాతం వృద్ధి.. డివిడెండ్ ప్రకటన..
Tcs
Follow us

|

Updated on: Oct 08, 2021 | 10:06 PM

దేశంలోఅతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ ప్టెంబర్​తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను(tcs quarterly results ) శుక్రవారం విడుదల చేసింది. రూ .9,624 కోట్ల నికర లాభం వచ్చినట్లు నివేదికలో పేర్కొంది. 14.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. సంస్థ ఆదాయం 16.7 శాతం పెరిగి రూ. 46,867 కోట్లకు చేరుకుంది. టీసీఎస్ గత ఏడాది ఇదే సమయంలో రూ. 40,135 కోట్ల ఆదాయం రాగా.. రూ. 8,433 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

శతాబ్ద కాలం నుంచి తమ సంస్థను వృద్ధి చేసుకుంటూ వస్తున్నామని సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ అన్నారు. బలమైన, నిరంతర డిమాండ్​ వాతావరణం అనేది సంస్థను అభివృద్ధి పథంలో నిలిపేందుకు దశాబ్దానికి ఒకసారి వచ్చే అవకాశమని చెప్పారు. మా బ్రాండ్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. తదుపరి ఐదేళ్లపాటు రాజేష్ MD, CEO గా తిరిగి నియమించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.

భారీ లాభాలను ఆర్జించిన టీసీఎస్ తమ వాటాదారులకు మరోసారి మధ్యంతర డివిడెండ్ అందించనుంది. ఒక్కో షేరుకు రూ.7 డివిడెండ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. టీసీఎస్ కొత్తగా 19,690 మంది సిబ్బందిని నియమించుకుంది. వీరితో కలిపి ఆ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 5,28,748కు పెరిగింది.

Read Also..Airtel Offer: ఎయిర్‎టెల్ బంపర్ ఆఫర్.. రూ.6000 క్యాష్‎బ్యాక్.. దీని కోసం మీరు ఏం చేయాలంటే..