AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Free Countries: ప్రపంచంలో ఎలాంటి పన్నులు విధించని దేశాలు.. కారణం ఏంటో తెలుసా?

Tax Free Countries: ఆదాయపు పన్ను విధించని దేశాలలో చాలా గల్ఫ్ దేశాలు ఉన్నాయి. యూరోపియన్, ఆఫ్రికన్ దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, చైనా వంటి పెద్ద, శక్తివంతమైన దేశాలు కూడా..

Tax Free Countries: ప్రపంచంలో ఎలాంటి పన్నులు విధించని దేశాలు.. కారణం ఏంటో తెలుసా?
Subhash Goud
|

Updated on: Oct 14, 2025 | 8:16 AM

Share

Tax Free Countries: ప్రపంచంలోని చాలా దేశాలు తమ పౌరుల నుండి ఆదాయపు పన్నులు, అనేక ఇతర పన్నులను వసూలు చేస్తాయి. ఈ పన్నులే వారి ఆర్థిక వ్యవస్థలను నడిపిస్తాయి. అయితే, కొన్ని దేశాలు తమ పౌరుల నుండి ఎటువంటి పన్నులు వసూలు చేయవు. వారి ఆదాయం ఎంత ఎక్కువగా ఉన్నా వసూలు చేయవు. ఈ దేశాల పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ దేశాల పౌరుల నుండి పన్నులు వసూలు చేయకపోవడానికి కారణాలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే ఈ పన్ను లేకపోవడం వల్ల ఈ ప్రజలు గణనీయమైన ఉపశమనం పొందుతారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఎలాంటి ట్యాక్స్‌ వసూలు చేయకపోయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి?.

ఇది కూడా చదవండి: Gold Price Today: హైదరాబాద్‌లో వెండి ధర రూ. 2 లక్షలు.. బంగారం ధర ఎంతో తెలిస్తే బిత్తరపోతారు!

ఆదాయపు పన్ను ఎందుకు విధించరు?

ఆదాయపు పన్ను విధించని దేశాలలో చాలా గల్ఫ్ దేశాలు ఉన్నాయి. యూరోపియన్, ఆఫ్రికన్ దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, చైనా వంటి పెద్ద, శక్తివంతమైన దేశాలు కూడా ఆదాయపు పన్నులు విధిస్తాయి. మరి కొన్ని దేశాలు పన్ను మినహాయింపు ఎందుకు అందిస్తోంది? దీని వెనుక ఉన్న నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. ఇక్కడి దేశాల్లో ఇతర మార్గాల ద్వారా వచ్చే రాబడి భారీగా ఉండటంతో ప్రజల నుంచి ట్యాక్స్‌ వసూలు చేయవు.

ఇవి కూడా చదవండి
  1. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: (UAE) ప్రపంచంలోనే ప్రముఖ పన్ను రహిత దేశం. ఆ దేశం తన పౌరులపై ఎటువంటి పన్నులు విధించదు. బదులుగా ప్రభుత్వం VAT (విలువ ఆధారిత పన్ను), ఇతర లెవీల వంటి పరోక్ష పన్నులపై ఆధారపడుతుంది. చమురు, పర్యాటక రంగం కారణంగా UAE ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అందుకే UAEలోని ప్రజలకు ఆదాయపు పన్నుల నుండి మినహాయింపు ఉంటుంది.
  2. బహ్రెయిన్: గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ పౌరులు కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బహ్రెయిన్‌లో ప్రభుత్వం ప్రజల నుండి ఎటువంటి పన్ను వసూలు చేయదు.
  3. కువైట్: కువైట్ కూడా పన్ను రహిత దేశాల జాబితాలో చేర్చింది. ఇక్కడ వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చమురుపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ చమురు ఇక్కడి నుండే ఎగుమతి అవుతుంది. దీని కారణంగా ప్రభుత్వం ఎటువంటి ప్రత్యక్ష పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  4. సౌదీ: అరేబియా కూడా తన పౌరులను పన్నుల ఇబ్బందుల నుండి పూర్తిగా విముక్తి చేస్తుంది. దేశంలో ప్రత్యక్ష పన్నులు రద్దు చేస్తుంది. అంటే పౌరులు తమ ఆదాయంలో ఒక్క భాగాన్ని కూడా పన్నుగా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, దేశంలో బలమైన పరోక్ష పన్ను వ్యవస్థ కూడా ఉంది. ఈ వ్యవస్థల నుండి వచ్చే నిధులు ఆర్థిక వ్యవస్థకు ఇంధనం ఇస్తాయి. ఇది అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా కూడా పరిగణిస్తారు.
  5. పర్యాటక స్వర్గధామమైన బహామాస్: ఇది పశ్చిమ అర్ధగోళంలో ఉంది. ఈ దేశం క్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే అక్కడి పౌరులు ఆదాయపు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆగ్నేయాసియాలో, చమురు నిల్వలకు నిలయంగా ఉంది. ఇక్కడి ప్రజల నుంచి ఎలాంటి ట్యాక్స్‌ వసూలు చేయరు.
  6. ఒమన్: ఒమన్‌లో చమురు, గ్యాస్ నిల్వలు భారీగా ఉన్నందున అక్కడి ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  7. ఖతార్‌: ఒమన్, బహ్రెయిన్, కువైట్ లాగానే ఖతార్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉంది. ఖతార్ కూడా దాని చమురు రంగంలో చాలా బలంగా ఉంది. దేశం చిన్నది అయినప్పటికీ, దాని నివాసితులు చాలా ధనవంతులు. ఇక్కడ ఆదాయపు పన్ను లేదు.
  8. మొనాకో: ఈ యూరోపియన్ దేశంలో, ప్రభుత్వం ప్రజల నుండి ఆదాయపు పన్ను వసూలు చేయదు.
  9. నౌరు: ప్రపంచంలోనే అతి చిన్న ద్వీప దేశమైన నౌరులో ప్రజలపై ఆదాయపు పన్ను విధించబడదు.

ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..