Tata Motors: దుమ్మురేపిన టాటా మోటార్స్.. జులైలో 51 శాతం పెరిగిన అమ్మకాలు..
Tata Motors: ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ సంస్థ టాటా జులై నెలలో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గత నెలలో టాటా అమ్మకాలు ఏకంగా 51.12 శాతం పెరిగినట్లు సంస్థ తెలిపింది...
Tata Motors: ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ సంస్థ టాటా జులై నెలలో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గత నెలలో టాటా అమ్మకాలు ఏకంగా 51.12 శాతం పెరిగినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్లో ఒక్క నెలలోనే ఏకంగా 81,790 యూనిట్స్ అమ్ముడుపోయినట్లు సంస్థ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే గతేడాది జులైలో టాటా మొత్తం 54,119 యూనిట్లు అమ్మకాలు జరిపినట్లు తెలిపింది. ఈసారి అమ్మకాలు భారీగా పెరగడం విశేషం. ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల విషయంలో గతేడాది 30,185 యూనిట్లు అమ్ముడుపోగా ఈ ఏడాది 47,505 యూనిట్స్ అమ్మకాలు జరిగాయి. వీటి అమ్మకాల్లో ఏకంగా 57 శాతం పెరుగుదల కనిపించింది.
ఇక టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లోనూ జోరు మీదుంది. గతేడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరితాయి. పోయిన సంవత్సరం జులైలో కేవలం 604 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 4,022 యూనిట్లకు చేరడం విశేషం. ఇక కమర్షియల్ వాహనాల అమ్మకాల విషయానికొస్తే గతేడాది జులైలో 21,796 యూనిట్లు కాగా, ఈ జులై ఈ సంఖ్య 31,473 యూనిట్లకు చేరడం విశేషం. ఇలా ఏ రకంగా చూసుకున్న గతేడాదితో పోల్చుకుంటే ఈసారి టాటా విక్రయాల్లో సత్తా చాటిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆగస్టులో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..